తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

అధిక జ్యేష్ట అమావాస్య ప్రాముఖ్యత 12 రాశుల వారిపై ప్రభావం

 

అధిక జ్యేష్ట అమావాస్య ప్రాముఖ్యత 

12 రాశుల వారిపై ప్రభావం



అధిక జ్యేష్ఠ అమావాస్య జూన్ 14 ఆదివారం మధ్యాహ్నం 12 :19 నిమిషాల నుంచి జూన్ 15 అనగా సోమవారం ఉదయం 8:23 వరకు ఈ అమావాస్య ఉంటుంది.


సనాతన ధర్మంలో అమావాస్య తిథికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇక అధిక మాసంలో వచ్చే అమావాస్యను అత్యంత పవిత్రంగా, పుణ్యప్రదంగా భావిస్తారు. ఆ రోజున పితృ తర్పణాలు, దానాలు, పరిహారాలు చేస్తే పుణ్యం లభిస్తుందని నమ్మకం. 


ఈరోజు చేసే పూజలు ,దానాలు, పరిహారాలతో రెట్టింపు ఫలితం వస్తుందని పెద్దలు చెబుతారు 


పితృ దోష లక్షణాలు 


1. వివాహం ఆలస్యం అవ్వడం 

2. సంతానం లేకపోవడం

3. ఆర్థిక ఇబ్బందులు 

4. కుటుంబ కలహాలు 

5. ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవడం 

6. ఆరోగ్య సమస్యలు 

7. మానసిక ఆందోళనలు 


అధిక జ్యేష్ట అమావాస్య రోజున చేయాల్సిన కార్యక్రమాలు 



1. పితృతర్పణాలు 

వేపూజమని నిద్రలేచి స్నానం చేసి నువ్వులతో పెద్దలకు తర్పణాలు ఇవ్వాలి.


2. పిండ ప్రధానం 

పుణ్యక్షేత్రాలు ,ఆలయాలు ,ఇంటి వద్ద పండితుల సమక్షంలో పెండ ప్రధానాలు చేయాలి.


3. పక్షులకు ఆహారం 

సాధారణంగా కాకులను పితృదేవతలకు ప్రతిరూపంగా భావిస్తారు ఆరోజున అన్నంలో నువ్వులు బెల్లం కలిపి రాశులకు పెడితే పుణ్యస్థలం. 


4. గోమాతకు..

గోవులకు పచ్చి గడ్డి అరటిపళ్ళు బెల్లం తినిపించాలి 


5. దైవారాధన 

ఈ రోజున శివకేశవము స్మరిస్తే పితృదేవతలు శాంతించి వారి ఆశీస్సులు లభిస్తాయి. 

 



జపించాల్సిన మంత్రాలు 


1. పితృ గాయత్రీ మంత్రం

ఓం పితృభ్యో విద్మహే జగద్ధాత్రేచ ధీమహి తన్నో పితరః ప్రచోదయాత్॥

108 సార్లు జపించాలి.


2. మహామృత్యుంజయ మంత్రం 


ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం।

ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్॥

11, 21 లేదా 108 సార్లు జపించవచ్చు.



చేయాల్సిన దానాలు 



1. వస్త్ర దానం 

2. గోదానం 

3.. గొడుగు దానం 

4. పాదరక్షల దానం 

5. అన్నదానం 


12 రాశుల వారిపై ప్రభావం 


1. మేషరాశి 

కుటుంబంలో శుభపరిణామాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది .

పరిహారం.. ఎర్ర వస్త్రం దానం ఇవ్వాలి


2. వృషభ రాశి 

ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త పెట్టుబడుల నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలి. 

పరిహారం.. తెల్ల బియ్యం దానం ఇవ్వాలి 


3. మిధున రాశి 

ఉద్యోగంలో కొత్త అవకాశాలు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది 

పరిహారం.. విష్ణు సహస్ర నామం పఠించాలి 


4. కర్కాటక రాశి 

మానసిక శాంతి లభిస్తుంది .సమస్యలు పరిష్కారం అవుతాయి 

పరిహారం.. శివాలయంలో అభిషేకం చేయించాలి 


5. సింహరాశి 

బాధ్యతలు స్వీకరిస్తారు. పేరు గడిస్తారు .

పరిహారం.. గో సేవ చేయాలి 


6. కన్య రాశి 

విద్యా, ఉద్యోగ రంగాల్లో పురోగతి .

పరిహారం.. విద్యార్థులకు పుస్తకదానం చేయాలి 


7. తులారాశి 

ఖర్చులు పెరుగుతాయి. భాగస్వాములతో జాగ్రత్త. 

పరిహారం…నువ్వులు దానం చేయాలి 


8. వృశ్చిక రాశి 

జీవితంలో ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి .

పరిహారం.. కాకులకు ఆహారం పెట్టాలి 


9. ధనస్సు రాశి 

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు 

పరిహారం.. గీతా పారాయణం చేయాలి 


10. మకర రాశి 

ఉద్యోగ ,వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు .

పరిహారం.. వృద్ధులకు భోజనం పెట్టాలి 


11. కుంభరాశి 

కుటుంబ సభ్యులు స్నేహితుల సహకారం లభిస్తుంది 

పరిహారం.. నీళ్ల దానం చేయాలి 


12. మీనం 

ఆగిన పనులు పూర్తవుతాయి .

పరిహారం.. విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించాలి.


 

జేష్ఠ అమావాస్య రోజు చేసే పనుల కారణంగా పితృదేవతలు శాంతించి వారి ఆశీస్సులు పొందేందుకు మనకు లభించిన మంచి అవకాశం. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. పితృదేవతలను ప్రతి అమావాస్యకు తలుచుకొని వారికి పై విధంగా శాంతి చేస్తే వారు మిక్కిలి సంతోషపడతారు. మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కుటుంబ గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. 

కావున ప్రతి ఒక్కరూ పై పరిహారాలు పాటించి పితృదేవతల ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా 

TELUGUNEWSROOM పేజీని ఫాలో అవ్వండి.


             🙏ఓం నమశ్శివాయ🙏

         🙏ఓం నమో వెంకటేశాయ🙏

 

లేటెస్ట్ ఆర్టికల్స్: క్లిక్ బిలో లింక్స్ 👇👇👇👇👇

సెప్టెంబర్ నెలలో తిరుపతి దర్శనానికి ఆన్లైన్ బుకింగ్ విడుదల చేసిన తిరుపతి దేవస్థానం వారు



Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్