తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు

Image
 FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది. విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.  1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.  తొలుత ఉన్న...

సెప్టెంబర్ నెలలో తిరుమల వెళ్ళాలనుకుంటున్నారా అయితే మీకు గుడ్ న్యూస్


 దర్శనం టికెట్లు విడుదల చేసే తేదీలు ఇవే..


తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించాలనే భక్తులకు దేవస్థానం ఒక కీలక ప్రకటన చేసింది .సెప్టెంబర్ నెల ఆర్జిత సేవ, ,దర్శనం, రూముల టికెట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఆసక్తి గల భక్తులు దేవస్థానం అధికారిక website ద్వారానే తమ లావాదేవీ నిర్వహించాలని సూచించింది. బ్రోకర్ల మాటలు విని ఇబ్బందులు పడవద్దు అని కోరింది.


శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ఏ సేవా టికెట్లు, ఏ రోజు విడుదలవుతాయో తెలుసుకొని తమ టూర్ ని ప్లాన్ చేసుకుంటే స్వామివారి దర్శనాన్ని ప్రశాంతంగా , భక్తి ప్రపత్తులతో పూర్తి చేసుకోవచ్చు.


అంగప్రదక్షిణ, శ్రీవాణి, సీనియర్ సిటిజన్స్..




సెప్టెంబర్ నెల అంగప్రదక్షిణ టోకెన్ల quota జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్ల కోటాను జూన్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు, వృద్ధులు వికలాంగుల దర్శన కోటాను జూన్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో ఉంచుతారు.

శ్రీవారి ఆర్థిక సేవా టికెట్లు లక్కీ డిప్..



సుప్రభాతం, తోమాల సేవ అష్టదళ పాద పద్మారాధన టికెట్లను జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. ఈ సేవలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కోసం భక్తులు జూన్ 20వ తేదీ వరకు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్ లో టికెట్లు పొందిన భక్తుల వివరాలను అదే రోజు రిలీజ్ చేస్తారు. జూన్ 20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు భక్తులు డబ్బులు కట్టి తమ టికెట్లను కన్ఫర్మ్ చేసుకోవాలి. 


 300 రూపాయల టికెట్ 


300 రూపాయలు దర్శన టికెట్లను జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. గదుల బుకింగ్ కోటాను జూన్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు 


ఇతర సేవలు 


శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత సేవ, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. వర్చువల్ సేవ దర్శన టికెట్ల స్లాట్లను జూన్ 22వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు. 


భక్తులు ప్రైవేటు వ్యక్తులను ,దళారులను, దేవస్థానం ఉద్యోగులమని చెప్పే వారిని నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం ప్రకటించింది. దర్శనం, వసతి టికెట్లను 

Ttdevasthanams.ap.gov.in

వెబ్సైట్ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. 


ఏది ఏమైనప్పటికీ ఆ కలియుగ దైవం తిరుమల వెంకన్న దర్శనం సకల భక్తులకు కలగాలని కోరుకుంటూ మరింత సమాచారం కోసం మా telugunewsroom పేజీని ఫాలో చేయాల్సిందిగా కోరుతున్నాం 


🛕నమో వెంకటేశాయ 🙏

🪷ఏడుకొండలవాడా🪷

🙏 వెంకటరమణా గోవిందా గోవిందా.🙏

Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

నాగబంధం సినిమా స్టోరీ (2026) | పూర్తి కథ, నటీనటులు, దర్శకుడు, నిర్మాతలు | Nagabandham Telugu Movie Story