తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు

Image
 FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది. విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.  1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.  తొలుత ఉన్న...

తొలి ఏకాదశి 2026 ఎప్పుడు? విశిష్టత, పూజా విధానం, నైవేద్యాలు, ఉపవాస నియమాలు – పూర్తి వివరాలు

 

తొలి ఏకాదశి సందర్భంగా శ్రీమహావిష్ణువును తులసి దళాలతో భక్తులు పూజిస్తున్న దృశ్యం


తొలి ఏకాదశి -2026 విశిష్టత

పూజా విధానం 

ఆరోజు చేయాల్సిన పనులు.


శ్రీ మహా విష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి జారుకునే రోజే తొలి ఏకాదశి. నాలుగు నెలల తర్వాత వచ్చే ఉత్తాన ఏకాదశి రోజు ఆయన నిద్ర లేస్తాడు. 


శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు కాబట్టే తొలి ఏకాదశి ఆ సంవత్సరంలో కెల్లా అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు.


2026 వ సంవత్సరం జూలై 25 వ తేదీన తొలి ఏకాదశి వస్తుంది.


శుభాల కలయిక

ఆరోజు ఉపవాస ఉండి శ్రీమహావిష్ణువు పూజిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఆర్థిక సమస్యలు తీరుతాయి .

ఆ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది .

చాతుర్మాస దీక్షల ప్రారంభానికి మంచి రోజు. 


ఆరోజు చేయాల్సిన పనులు …


ఆరోజు వేకువ జామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి.పూజ గదిని శుభ్రం చేసి దీపం వెలిగించాలో.శ్రీమహావిష్ణువుని ,శ్రీకృష్ణుడు , శ్రీరాముల వారిని పూజించాలి.ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండాలి. షుగర్ పేషెంట్లు ఉపవాసాలకు దూరంగా ఉంటే మంచిది. ఆ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చదివితే జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుంది. 


జపించాల్సిన మంత్రం 

ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవాలి


తులసి ఆరాధన 

మహావిష్ణువును తులసీదళాలతో అర్చన చేస్తే ఆయన అనుగ్రహం కలిగి పుణ్యఫలం లభిస్తుంది


చేయాల్సిన దానాలు

తొలి ఏకాదశి సందర్భంగా శ్రీమహావిష్ణువును తులసి దళాలతో భక్తులు పూజిస్తున్న దృశ్యం


అన్నదానం, వస్త్ర దానం, పండ్ల దానం చేయాలి. 


పూజా విధానం ..

తొలి ఏకాదశి సందర్భంగా శ్రీమహావిష్ణువును తులసి దళాలతో భక్తులు పూజిస్తున్న దృశ్యం


గణపతి ధ్యానంతో పూజ ప్రారంభించాలి. పూజ దగ్గర కలశాన్ని ప్రతిష్టించాలి. శ్రీమహావిష్ణువు అభిషేకం చేయాలి. అక్షతలు సమర్పించాలి. అనంతరం విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. హారతి ,నైవేద్యం సమర్పించి కుటుంబ సభ్యులకు వితరణ చేయాలి. 


దేవుడికి పెట్టాల్సిన నైవేద్యాలు 

తొలి ఏకాదశి సందర్భంగా శ్రీమహావిష్ణువును తులసి దళాలతో భక్తులు పూజిస్తున్న దృశ్యం


చక్కెర పొంగలి

పాయసం 

పులిహోర

పంచామృతం 

ద్రాక్ష 

అరటి 

కొబ్బరికాయ 

ఖర్జూరాలు 

తులసీదళాలు 


జపించాల్సిన మంత్రాలు 


ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 

ఓం నమో నారాయణాయ


చేయకూడని పనులు 

ఇతరులను దూషించవద్దు. మద్యం ,మత్తు పానీయాలకు దూరంగా ఉండాలి .నిరంతరం భగవంతుడీ నామస్మరణ చేయాలి. 


ఉపవాసం ముగింపు 

ద్వాదశి రోజున భక్తులు ఉపవాసాన్ని ముగించాలి. 


సమస్త మానవాళికి ఆ మహావిష్ణువు అనుగ్రహం కలగాలని కోరుతూ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. 


ఇలాంటి మరింత సమాచారం కోసం మా 

తెలుగు న్యూస్ రూమ్

 పేజీని ఫాలో చేయండి..


Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

నాగబంధం సినిమా స్టోరీ (2026) | పూర్తి కథ, నటీనటులు, దర్శకుడు, నిర్మాతలు | Nagabandham Telugu Movie Story