వాయనాట్టు కులవన్ దేవస్థానం – కాసరగోడ్, కేరళ | చరిత్ర, విశేషాలు, తేయ్యం, దర్శన సమాచారం
సాధారణంగా ఏదైనా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు ,అభిషేకాలు, హోమాలు, జపాలు, కళ్యాణోత్సవాలు ,బ్రహ్మోత్సవాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తే పలు సమస్యల నుంచి బయట పడవచ్చు అని మనం వింటుంటాం కానీ భారతదేశంలోని ఈ ఆలయం మాత్రం ఒక విశిష్టమైన మహా శక్తిని కలిగి ఉంది ఈ ఆలయ ప్రసాదం మన ఇంట్లో ఉంటే కోర్టు కేసుల నుంచి సులువుగా బయటపడవచ్చు అంతేకాక మన శరీరంలో కడుపుకు సంబంధించిన గ్యాస్ ట్రబుల్, అల్సర్, పేగు పుండులు తదితర సమస్యల నుంచి కూడా సులువుగా నయమవుతాయి. పై మాటలు చదివి ఇదేదో వింతగా ఉంది అనుకుంటున్నారా కానీ 100% అక్షరాలా నిజం. సుప్రీంకోర్టుకు చెందిన పలువురు కక్షీదారులు ప్రతిరోజు ఢిల్లీ నుంచి ఈ ఆలయానికి వచ్చి ఆలయంలో పూజారి విక్రయించే ప్రసాదాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తారు. ఈ ప్రసాదాన్ని దేవుడి గదిలో ఉంచి ప్రతిరోజు పూజ చేయడం వల్ల మనకు సకల శుభాలు కలుగుతాయి .ఇప్పుడు ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి. కేరళ రాష్ట్రంలోని కాసరగుడు జిల్లాలో పలు వాయునట్టు కులవన్ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పలక్ శ్రీ వాయునట్టు కులం దేవస్థానం. ఈ దేవతను గ్రామ రక్షకుడిగా పలువురు ఆరాధిస్తారు...

This comment has been removed by the author.
ReplyDelete