Posts

తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

వాయనాట్టు కులవన్ దేవస్థానం – కాసరగోడ్, కేరళ | చరిత్ర, విశేషాలు, తేయ్యం, దర్శన సమాచారం

Image
  సాధారణంగా ఏదైనా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు ,అభిషేకాలు, హోమాలు, జపాలు, కళ్యాణోత్సవాలు ,బ్రహ్మోత్సవాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తే పలు సమస్యల నుంచి బయట పడవచ్చు అని మనం వింటుంటాం కానీ భారతదేశంలోని ఈ ఆలయం మాత్రం ఒక విశిష్టమైన మహా శక్తిని కలిగి ఉంది  ఈ ఆలయ ప్రసాదం మన ఇంట్లో ఉంటే కోర్టు కేసుల నుంచి సులువుగా బయటపడవచ్చు అంతేకాక మన శరీరంలో కడుపుకు సంబంధించిన గ్యాస్ ట్రబుల్, అల్సర్, పేగు పుండులు తదితర సమస్యల నుంచి కూడా సులువుగా నయమవుతాయి.  పై మాటలు చదివి ఇదేదో వింతగా ఉంది అనుకుంటున్నారా కానీ 100% అక్షరాలా నిజం. సుప్రీంకోర్టుకు చెందిన పలువురు కక్షీదారులు ప్రతిరోజు ఢిల్లీ నుంచి ఈ ఆలయానికి వచ్చి ఆలయంలో పూజారి విక్రయించే ప్రసాదాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తారు. ఈ ప్రసాదాన్ని దేవుడి గదిలో ఉంచి ప్రతిరోజు పూజ చేయడం వల్ల మనకు సకల శుభాలు కలుగుతాయి .ఇప్పుడు ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి.  కేరళ రాష్ట్రంలోని కాసరగుడు జిల్లాలో పలు వాయునట్టు కులవన్ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పలక్ శ్రీ వాయునట్టు కులం దేవస్థానం. ఈ దేవతను గ్రామ రక్షకుడిగా పలువురు ఆరాధిస్తారు...

మీరు వెళ్లే రైలు 3 గంటలు ఆలస్యమైతే రిఫండ్ వస్తుందా? ఇండియన్ రైల్వే పూర్తి నిబంధనలు

Image
 మీరు వెళ్లే రైలు మూడు గంటలు ఆలస్యమైతే  మీ టిక్కెట్ రిఫండ్ వస్తుందా . 2014 ముందు వరకు భారతీయ రైల్వే అంటే ఆలస్యానికి ప్రతిరూపం. ఏ సమయంలో ఏ రైలు ఏ స్టేషన్లో ఉంటుందో తెలియని పరిస్థితి .మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక ఈ పరిస్థితుల్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. ట్రాక్లను మార్చి వేగ పరిమితిని పెంచటం, అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ,సిబ్బంది నియామకం, వందే భారత్ రైళ్ల ప్రవేశంతో భారతీయ రైల్వే రూపురేఖలు మారిపోయాయి . దేశవ్యాప్తంగా ఉన్న వేలాది రైళ్లు ప్రతిరోజు 90% వరకు అనుకున్న సమయానికి గమ్యస్థానాలకు చేరుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ట్రాక్ల మరమ్మత్తులు, వాతావరణ మార్పులు ….ఉదాహరణకు భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడటం, అడవి ప్రాంతాల్లో రైలు పట్టాలు దాటుతూ అడవి జంతువులు రైలు కిందపడి దుర్మరణం చెందడం, ప్రజల ఆత్మహత్యలు ,పట్టాల మధ్య ఉన్న కప్లింగ్ లు లూస్ అవ్వటం, నేర చర్యలు తదితర కారణాలతో కొన్ని రైళ్లు ఆలస్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు టికెట్ చేసేందుకు వీలుగా రైల్వే శాఖ టిడిఆర్ టికెట్ డిపాజిట్ రిసిప్ట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. మూడు గంటలకు మించి ఆలస్యమైతే .. మనం వెళ్లాల్సిన రైలు...

నాగబంధం సినిమా స్టోరీ (2026) | పూర్తి కథ, నటీనటులు, దర్శకుడు, నిర్మాతలు | Nagabandham Telugu Movie Story

Image
  నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్ (2026) తెలుగు సినిమా పూర్తి కథ, క్లైమాక్స్, నటీనటులు, దర్శకుడు అభిషేక్ నామా, నిర్మాతలు, విడుదల తేదీ మరియు ఇతర ఆసక్తికర వివరాలను తెలుసుకోండి పౌరాణిక నేపథ్యంలో.. యాక్షన్ ,అడ్వెంచర్ కు పెద్దపీట వేస్తూ ప్రేక్షకులకు మనోరంజకరమైన అంశాలతో ముడిపడిన సినిమా నాగబంధం. జులై 3న థియేటర్లలో విడుదలై అభిమానుల ఆదరణ పొందుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర కథాంశం, స్క్రీన్ ప్లే, తారాగణం, దర్శకత్వం ,నిర్మాణ సంస్థ తదితర వివరాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ వివరాలు మీకోసం … దర్శకుడు అభిషేక్ నామా   నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి నిశిత నాగిరెడ్డి  కథ – స్క్రీన్‌ప్లే కథ, స్క్రీన్‌ప్లే: అభిషేక్ నామా సంభాషణలు: కళ్యాణ్ చక్రవర్తి, శ్రవణ్ కుమార్ తడ్కా   సంగీతం అబే జునైద్ కుమార్   సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్   ఎడిటర్ ఆర్. సి. ప్రణవ్   ప్రధాన నటీనటులు విరాట్ కర్ణ – రుద్ర నభా నటేష్ – పార్వతి ఐశ్వర్య మేనన్ దక్ష నాగర్కర్ – ప్రియమణి జగపతి బాబు మురళీ శర్మ – ఆచ్యుత చారి కథాంశం  ఈ సినిమా 19వ శతాబ్దంలోని ఒక పురాతన దేవాలయంలో అష్...

జూలై 7, 2026 ఈరోజు బంగారం, వెండి ధరలు | 22 క్యారెట్, 24 క్యారెట్ గోల్డ్ రేట్లు & సిల్వర్ ధరలు

Image
           ఈ రోజు బంగారం,వెండి ధరలు  24 క్యారెట్స్ :  1 గ్రాము - ₹14661 10 గ్రాములు - ₹169129 22 క్యారెట్స్ గోల్డ్ : 1 గ్రాము - ₹13439 10 గ్రాములు - ₹155032  సిల్వర్ : 1 గ్రాము - ₹249 1 కిలో - ₹2,49,900 అంతర్జాతీయ పరిస్థితులు ..ఇజ్రాయిల్, అమెరికా ,ఇరాన్ యుద్ధం ఆగిపోవడం.. డాలర్ తో రూపాయి మారకం విలువలో హెచ్చుతగ్గులు తదితర కారణాలతో బంగారం ధర కొద్దిగా తగ్గింది. కొనుగోలుదరులు స్థానిక మార్కెట్లో ధరలను పరిశీలించి తమ లావాదేవీలు కొనసాగించాలని కోరుతున్నాము.  ఇలాంటి మరింత సమాచారం కోసం మా తెలుగు న్యూస్ రూమ్ పేజీ ని  ఫాలో అవ్వండి. ఈరోజు బంగారం ధర, ఈరోజు వెండి ధర, Gold Rate Today, Silver Rate Today, Gold Price Telugu, Silver Price Telugu, 22K Gold Rate, 24K Gold Rate, Gold Rate July 7 2026, Silver Rate July 7 2026, Hyderabad Gold Rate, India Gold Price, Today Gold News, Today Silver News

Citizen Vigilante (2026) సినిమా కథ | పూర్తి స్టోరీ, నటీనటులు, విడుదల వివరాలు తెలుగులో

Image
సిటిజన్ విజిల్ … బతుకుతెరువు కోసం దేశం గాని దేశం వచ్చి ఆశ్రయమిచ్చిన ప్రజలకు హాని తలపెట్టే శరణార్థులు… చట్టంలోని లొసుగులు ఉపయోగించుకుంటూ తప్పించుకుంటున్న వైనం.. వాళ్ళకి కొమ్ముకాస్తున్న రాజకీయ నాయకులు, అధికార యంత్రాంగం.. దీనిపై ఒక పౌరుడి ఆగ్రహం ..చట్టాన్ని తన చేతుల్లో తీసుకొని నిందితులను హతమార్చిన ఘటనలు. తదితర అంశాలతో సిటిజన్ విజిల్ చిత్రాన్ని రూపొందించారు. ఇది విడుదలైన కొన్ని గంటలకే యూరప్ మొత్తం ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి అక్కడి ప్రభుత్వాలు ఈ సినిమాని బ్యాన్ చేశాయి .ఇదే సమయంలో ఎలాన్ మాస్క్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ సినిమాను డౌన్లోడ్ చేసి ఉంచడంతో దాన్ని కొన్ని మిలియన్ల మంది వీక్షించారు. సినిమా వాస్తవ సంఘటనకు ప్రతిరూపంగా నిలిచిందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థుల తాగడానికి చరమగీతం పాడాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెప్పిందన్న అభిప్రాయాలు వెల్లువెత్తాయి.     హీరో క్యారెక్టర్ సాండర్స్ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని నేరస్తులను చంపడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని, చట్టంపై పౌరులకు నమ్మకం కోల్పోయేలా ఈ చిత్రాన్ని చిత్రీకరించారని పలువురు ఉదారవా...

జూలై 4, 2026 పంచాంగం | ఈరోజు తిథి, నక్షత్రం, రాహుకాలం, యమగండం, శుభ సమయాలు

Image
  శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి, హనుమంతుడికి ప్రీతికరమైన రోజు. ఆ రోజున సమీపంలో ఉన్న దేవాలయాన్ని దర్శించుకుని హనుమంతుల వారికి ఆకు పూజ, సింధూరార్చన చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి పనులు సకాలంలో పూర్తవుతాయి. వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పిస్తే కార్య సిద్ధి జరుగుతుంది. తేదీ: జూలై 4, 2026 (శనివారం) ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం,  ఉత్తరాయణం,  గ్రీష్మ ఋతువు,  నిజ జ్యేష్ఠ మాసం,  కృష్ణ పక్షం  చవితి తిథి ఉదయం 9:45 గంటల వరకు ఉంటుంది. అనంతరం తదుపరి తిథి ప్రారంభమవుతుంది. ధనిష్ఠ నక్షత్రం ఉదయం 11:45 గంటల వరకు కొనసాగుతుంది వర్జ్యం రాత్రి 7:12 నుంచి 8:51 గంటల వరకు ఉంది.  దుర్ముహూర్తం ఉదయం 5:33 నుంచి 7:17 గంటల వరకు ఉంటుంది.  అమృతకాలం మరుసటి రోజు తెల్లవారుజామున 5:08 గంటల నుంచి ప్రారంభమవుతుంది. సూర్యుడు మిథున రాశిలో, చంద్రుడు కుంభ రాశిలో సంచరిస్తున్నారు. సూర్యోదయం ఉదయం 5:33 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:35 గంటలకు జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ నమః  హర హర మహాదేవ శంభో శంకర సర్వేజనా సుఖినోభవంతు   ఇలాంటి మరింత సమాచారం కోసం మా తెలుగు న్యూస్ రూమ్ పేజీన...

వకుళా మాత సన్నిధిలో అక్షర గోవిందం | తిరుమలలో పిల్లలకు అక్షరాభ్యాసం విశేషాలు

Image
  తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో  ఉచిత అక్షరాభ్యాసం ..అన్నప్రాసన సేవలు ఆధ్యాత్మిక ,విద్య, వైద్యం అన్నదాన సేవలతో భక్తులకు విశేష సేవలు అందిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం తమ కార్యక్రమాల విస్తరణ లో  భాగంగా మరో సేవను జోడించింది.  అదే అక్షర గోవిందం.  బిడ్డ ఎదుగుదలలో తల్లి పాత్ర కీలకం. ఆమె ఆశీస్సులు ఉన్నప్పుడే ఉన్నతంగా రాణిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం చిన్నారుల అక్షరాభ్యాసం కోసం అక్షర గోవిందం కార్యక్రమానికి  శ్రీకారం చుట్టింది. దీనికి వేదికగా వెంకటేశ్వర స్వామి పెంపుడు తల్లి వకుళా మాత ఆలయాన్ని ఎంపిక చేశారు. ఈ ఆలయం తిరుపతి సమీపంలోని పేరూరు బండ కొండపై ఉంది. ఈమెను ద్వాపర యుగంలో కృష్ణుని తల్లి యశోద గా చెబుతారు. సప్త గిరిలకు ఎదురుగా.. పేరూరు బండ వకుళామాత ఆలయం సప్తగిరులకు ఎదురుగా ఉంటుంది. ఇక్కడి నుంచి అమ్మవారు తిరుమల లోని తన పుత్రుడిని చూస్తూ ఉంటుందని భక్తుల విశ్వాసం. తమ చిన్నారుల అక్షరాభ్యాసం కోసం తల్లిదండ్రులు గతంలో సరస్వతి ఆలయాల్లో అక్షరాభ్యాస కార్యక్రమాలు చేయించేవారు.దీనికోసం ఎక్కువమంది ఆదిలాబాద్ జిల్లాలోని బాసర సరస్వతి ఆలయాన్ని సం...