తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు

Image
 FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది. విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.  1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.  తొలుత ఉన్న...

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్

 



యమునా పుష్కరాలకు వెళ్లే భక్తులకు శుభవార్త.

 

యమునా పుష్కరాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఐ ఆర్ సి టి సి ఒక ప్రత్యేక ప్యాకేజీని తీసుకోవచ్చింది. అయోధ్య, కాశీ, ప్ ప్రయాగ్ రాజు,బైద్యనాథ్, పూరి కోణార్క్ సారనాథ్, యమునా పుష్కరాల స్నానాల నిమిత్తం భారత్ గౌరవ్ పేరుతో ఒక ప్రత్యేక టూరును ప్రారంభించింది. 


ప్రారంభ తేదీ…జూన్ 3 

ఎన్ని రోజులు…మొత్తం పది రోజులు 

దర్శించే పుణ్యక్షేత్రాలు.. పూరి కోణార్క్ వైద్యనాథ్ కాశి అయోధ్య ప్రయాగ్రాజ్..


ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో ఈ రైలు ఆగే స్టేషన్లు ..

సికింద్రాబాద్, హైదరాబాద్ ,వరంగల్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తనుకు, నిడదవోలు ,సామర్లకోట, రాజమండ్రి ,తుని, దువ్వాడ, పెందుర్తి. 


యాత్ర సాగుతుంది ఇలా


మొదటిరోజు 

సంబంధిత స్టేషన్లో ప్రయాణికులు ఎక్కుతారు. ఆ రోజంతా జర్నీలోనే ఉంటారు. 


రెండో రోజు 

పూరీ లో రైలు ఆగుతుంది. అక్కడ హోటల్లో స్టే చేస్తారు. జగన్నాథ ఆలయాన్ని దర్శించుకుంటారు. 


మూడో రోజు 

బ్రేక్ ఫాస్ట్ అనంతరం కోణార్క్ సూర్య దేవాలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం మాలతి తత్పూర్ స్టేషన్ లో రైలు ఎక్కుతారు.


నాలుగో రోజు 

జార్ఖండ్ లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రమైన వైద్యనాథ్ దర్శనం అనంతరం కాశీ బయలుదేరుతారు. 


ఐదో రోజు 




కాశీ చేరుకొని బస్సులో సారనాథ్ వెళ్తారు. అక్కడే బస చేస్తారు.


ఆరో రోజు 

బ్రేక్ఫాస్ట్ అనంతరం కాశి చేరుకుంటారు .ఆ రోజు మొత్తం కాశి విశ్వనాథ ఆలయం, అన్నపూర్ణ దేవి ఆలయం, సిటీ టూర్ ,సాయంత్రానికి గంగా హారతి వీక్షిస్తారు. 


ఏడో రోజు 

కాశీ నుంచి అయోధ్య చేరుకుంటారు .అయోధ్యలో రామ్ మందిరం, స్థానిక ఆలయాలను దర్శించుకుంటారు .అనంతరం రైల్వే స్టేషన్ కి వస్తారు .


ఎనిమిదో రోజు 

రైల్లో త్రివేణి సంగమం చేరుకుంటారు. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం లో యమునా పుష్కర స్నానం చేస్తారు .అనంతరం స్థానిక ఆలయాలు దర్శిస్తారు .తిరిగి రైలులో సికింద్రాబాద్ ,విజయవాడ బయలుదేరుతారు. 


9 …10 రోజులు 

ఈ రెండు రోజులు రైల్లోనే జర్నీ ఉంటుంది. ప్రయాణికులకు భోజన వసతి సదుపాయం కల్పిస్తారు.

ముఖ్యమైన ప్రాంతాల్లో రైలు ఆగుతుంది.అక్కడ ప్రయాణికులు దిగిపోతారు. జూన్ 12న యాత్ర ముగుస్తుంది. 


టూర్ ధరలు 


స్లీపర్ క్లాస్ ఒక్కరికి 16,000.. పిల్లలకు.. 15,600 

థర్డ్ ఏసి.. ఒకరికి.. 26, 100.. పిల్లలకు..24,800

సెకండ్ ఏసి ..34100.. పిల్లలకు..32500


టికెట్లు లభించే కేంద్రాలు ..


సికింద్రాబాద్, విజయవాడ రైల్వే స్టేషన్ లోని ఐఆర్సిటిసి కేంద్రాల్లో టికెట్లు లభిస్తాయి. 

లేకపోతే www.irctc tourism.com 

అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.


ఇంకెందుకు ఆలస్యం. ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకుని యాత్రకు ఏర్పాట్లు చేసుకోండి. 


జై యమునా మాత..


 ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా తెలుగు న్యూస్ రూమ్ పేజీని ఫాలో చేయండి.


Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

నాగబంధం సినిమా స్టోరీ (2026) | పూర్తి కథ, నటీనటులు, దర్శకుడు, నిర్మాతలు | Nagabandham Telugu Movie Story