తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

తొలి ఏకాదశి 2026 ఎప్పుడు? విశిష్టత, పూజా విధానం, నైవేద్యాలు, ఉపవాస నియమాలు – పూర్తి వివరాలు

Image
  తొలి ఏకాదశి -2026 విశిష్టత పూజా విధానం  ఆరోజు చేయాల్సిన పనులు. శ్రీ మహా విష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి జారుకునే రోజే తొలి ఏకాదశి. నాలుగు నెలల తర్వాత వచ్చే ఉత్తాన ఏకాదశి రోజు ఆయన నిద్ర లేస్తాడు.  శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు కాబట్టే తొలి ఏకాదశి ఆ సంవత్సరంలో కెల్లా అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. 2026 వ సంవత్సరం జూలై 25 వ తేదీన తొలి ఏకాదశి వస్తుంది. శుభాల కలయిక ఆరోజు ఉపవాస ఉండి శ్రీమహావిష్ణువు పూజిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.  ఆర్థిక సమస్యలు తీరుతాయి . ఆ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది . చాతుర్మాస దీక్షల ప్రారంభానికి మంచి రోజు.  ఆరోజు చేయాల్సిన పనులు … ఆరోజు వేకువ జామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి. పూజ గదిని శుభ్రం చేసి దీపం వెలిగించాలో.శ్రీమహావిష్ణువుని ,శ్రీకృష్ణుడు , శ్రీరాముల వారిని పూజించాలి. ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండాలి. షుగర్ పేషెంట్లు ఉపవాసాలకు దూరంగా ఉంటే మంచిది.  ఆ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చదివితే జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుంది.  జపించాల్సిన మంత్రం  ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 స...

వకుళా మాత సన్నిధిలో అక్షర గోవిందం | తిరుమలలో పిల్లలకు అక్షరాభ్యాసం విశేషాలు

 

తిరుమల వకుళా మాత సన్నిధిలో పిల్లలకు అక్షర గోవిందం నిర్వహిస్తున్న దృశ్యం


తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 

ఉచిత అక్షరాభ్యాసం ..అన్నప్రాసన సేవలు


ఆధ్యాత్మిక ,విద్య, వైద్యం అన్నదాన సేవలతో భక్తులకు విశేష సేవలు అందిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం తమ కార్యక్రమాల విస్తరణ లో  భాగంగా మరో సేవను జోడించింది. 

అదే అక్షర గోవిందం. 


బిడ్డ ఎదుగుదలలో తల్లి పాత్ర కీలకం. ఆమె ఆశీస్సులు ఉన్నప్పుడే ఉన్నతంగా రాణిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం చిన్నారుల అక్షరాభ్యాసం కోసం అక్షర గోవిందం కార్యక్రమానికి  శ్రీకారం చుట్టింది. దీనికి వేదికగా వెంకటేశ్వర స్వామి పెంపుడు తల్లి వకుళా మాత ఆలయాన్ని ఎంపిక చేశారు. ఈ ఆలయం తిరుపతి సమీపంలోని పేరూరు బండ కొండపై ఉంది. ఈమెను ద్వాపర యుగంలో కృష్ణుని తల్లి యశోద గా చెబుతారు.




సప్త గిరిలకు ఎదురుగా..

పేరూరు బండ వకుళామాత ఆలయం సప్తగిరులకు ఎదురుగా ఉంటుంది. ఇక్కడి నుంచి అమ్మవారు తిరుమల లోని తన పుత్రుడిని చూస్తూ ఉంటుందని భక్తుల విశ్వాసం.


తమ చిన్నారుల అక్షరాభ్యాసం కోసం తల్లిదండ్రులు గతంలో సరస్వతి ఆలయాల్లో అక్షరాభ్యాస కార్యక్రమాలు చేయించేవారు.దీనికోసం ఎక్కువమంది ఆదిలాబాద్ జిల్లాలోని బాసర సరస్వతి ఆలయాన్ని సందర్శిస్తారు అక్కడ తమ చిన్నారుల చేత శాస్త్రబద్ధంగా అక్షరాభ్యాసం చేయిస్తారు అయితే ఇది దూరా భారం.  ఖర్చుతో కూడుకున్నది. ఈ నేపథ్యంలో తిరుపతి దేవస్థానం వారు తీసుకువచ్చిన అక్షరగోవిందం ఆంధ్ర ,రాయలసీమ ప్రాంత భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.




రిజిస్ట్రేషన్ వివరాలు… నియమ నిబంధనలు


అక్షర గోవిందం కార్యక్రమానికి సంబంధించి ఆన్లైన్లో ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదు. కార్యక్రమానికి ఒక గంట ముందు ఆలయానికి చేరుకొని అక్కడి సిబ్బంది వద్ద తమ వివరాలు నమోదు చేసుకోవాలి. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఎటువంటి దళారులను  నమ్మవద్దని అధికారులు సూచించారు.


*. చిన్నారుల వయసు 3 నుంచి 5 సంవత్సరాల లోపు ఉండాలి.  వయోపరిమితిని ధృవీకరించుకోవటానికి ఆధార్ కార్డు గాని జనన పత్రం గాని వెంట తెచ్చుకోవాలి.

* ఆలయానికి ఒక గంట ముందుగా చేరుకొని తమ వివరాలను నమోదు చేసుకోవాలి.  ఎవరైతే ముందుగా వస్తారో వారికి స్లాట్ లు కేటాయిస్తారు ఆలస్యంగా వచ్చినవారు మరుసటి రోజు వరకు వేచి ఉండాలి.

*. రోజు రెండు విడతల్లో మొత్తం 50 మందికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. మీరు ఏదో ఒక బ్యాచ్ లో పాల్గొని కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి.


నోట్.. మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించరు భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ ప్రయాణాలను సర్దుబాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.


అక్షర గోవిందంలో భక్తులకు ఇచ్చే కిట్టులో ఉండే వస్తువులు..


కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క చిన్నారికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఒక కిట్ అందజేస్తారు ఇది ఆ కలియుగ వైకుంఠుని ఆశీస్సులతో ఇచ్చే ఒక అపురూపమైన కానుక .అందులో ఉండే వస్తువులు ఇవే. 


1 పిల్లలు అక్షరాల దిద్దేందుకు ఉపయోగపడే ఒక పలక మరియు శుద్ధ మొక్క 

2. అక్షింతలు, పసుపు, కుంకుమ ప్యాకెట్లు 

3. పవిత్రమైన దారాలు, మిఠాయిలు. 

4. వకుళా మాత , వెంకటేశ్వర స్వామి, పద్మావతి సరస్వతీదేవి చిత్రపటాలు 

5. గోవింద నామాలు, వెంకటేశ్వర సుప్రభాతం పుస్తకాలు ,పెద్దబాలశిక్ష. 

6. పూజకు కావలసిన ఇతర సామాగ్రి ఉంటాయి. 


అన్నప్రాసన ..


అక్షర గోవిందం తో పాటు ఆలయంలో చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని కూడా  నిర్వహిస్తున్నారు. అన్నప్రాసన అంటే శిశువులు మొదటిసారిగా ఆహారం తినే ఒక వేడుక .. పండితుల వేదమంత్రాల నడుమ చిన్నారులకు తొలిసారిగా ఆహారం రుచి చూపిస్తారు. ఈ ఆహారం అమృతం లాగా మారి శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుందని భక్తుల విశ్వాసం.దీనికి కావలసిన వస్తువులను సిబ్బంది ఉచితంగా అందజేస్తారు.



కార్యక్రమం ప్రారంభం తేదీ

జులై మూడో తేదీ మధ్యాహ్నం 12 నుంచి 12:30 వరకు జరిగింది. 

జులై నాలుగు నుంచి ప్రతి రోజు నిరంతరం ఈ కార్యక్రమం నిర్వహిస్తారు మంగళవారం ఈ కార్యక్రమాలు నిర్వహించరు భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. 


ఆలయానికి వెళ్ళాలి ఇలా ..


తిరుపతి వకుళా మాత ఆలయం తిరుపతి పట్నం నుంచి అయిదు నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది .ఇక్కడికి బస్సులు ఆటోలు ప్రైవేటు వాహనాల్లో చేరుకోవచ్చు. కొండపై కొన్ని మెట్లు ఉంటాయి వాటిని ఎక్కాల్సి ఉంటుంది పెద్ద వయసు వారు కొద్దిగా కష్టపడాలి.


సమీప రైల్వే స్టేషన్.. తిరుపతి రైల్వే స్టేషన్ 

విమానాశ్రయం.. రేణిగుంట ఎయిర్ పోర్ట్


అక్షర గోవిందంలో పాల్గొనే తల్లిదండ్రులు సంప్రదాయ దుస్తులు ధరించాలి.


భక్తకోటికి ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతూ



ఇలాంటి మరింత సమాచారం కోసం మా తెలుగు న్యూస్ రూమ్ 
పేజీని ఫాలో అవ్వండి.

#వకుళామాత #అక్షరగోవిందం #అక్షరాభ్యాసం #తిరుమల #తిరుపతి #వెంకటేశ్వరస్వామి #TTD #TeluguTemple #Devotional #HinduTemple #Spiritual #TeluguNews #TempleNews


Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్