FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు
FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది.
విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.
1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.
తొలుత ఉన్న నిబంధనలు
1. విదేశీ నిధులను నిర్దిష్ట అవసరాలకు మాత్రమే ఖర్చు చేయాలి
2. ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి రిటర్న్స్ సమర్పించాలి.
3. ఖర్చు పెట్టే ప్రతి పైసాకు రికార్డులు రూపొందించాలి.
4. నిర్దిష్ట ఖాతా ద్వారా మాత్రమే లావాదేవీలు చేపట్టాలి.
2020లో తీసుకు వచ్చిన మార్పు లు
1. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదిత శాఖలో ఎఫ్ సి ఆర్ ఏ ఖాతా తెరవాలి.
2. నిర్వహణ నిధుల కోసం 20% మాత్రమే ఖర్చు పెట్టాలి. గతంలో ఆఫీసు అద్దెలు, కరెంటు బిల్లు, రవాణాచార్జీలు, సిబ్బంది జీతాలు తదితర కారణాలతో విదేశీ నిధుల్లో 50 శాతం వరకు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు దాన్ని 20 శాతానికి పరిమితం చేశారు.
3. నిధుల బదిలీపై నిషేధం. గతంలో ఒక సంస్థకు వచ్చిన నిధులను ఇతర సంస్థలకు ,వ్యక్తులకు బదిలీ చేసేవారు. ఇప్పుడు దానిపై నిషేధం విధించారు
4. గుర్తింపు పత్రాలు. స్వచ్ఛంద సంస్థల ఏర్పాటుకు ముందుకు వచ్చే వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన తగిన పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి. గతంలో ఈ నిబంధనలో కొంత వెసులుబాటు ఉండేది.
ప్రస్తుతం తీసుకు వస్తున్న మార్పులు
1. రిజిస్ట్రేషన్ రద్దు. ఏదైనా స్వచ్ఛంద సంస్థ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ సంస్థ రిజిస్ట్రేషన్ రద్దు చేసే అవకాశం ఉంటుంది.
2. ఆస్తుల స్వాధీనం. స్వచ్ఛంద సంస్థ రిజిస్ట్రేషన్ రద్దయిన తర్వాత ఆ సంస్థ పరిధిలో ఉన్న ఆస్తులు ఒక ప్రత్యేక సంస్థకు దక్కుతాయి. ఉదాహరణకు ఒక సంస్థ ఆసుపత్రి నిర్వహిస్తూ తన లైసెన్సును కోల్పోతే ఆసుపత్రి బిల్లింగ్ ప్రభుత్వ పరం అవుతుంది.
3. రూ పది లక్షల నిబంధన. వరుసగా రెండు సంవత్సరాల కాల వ్యవధిలో ఏదైనా స్వచ్ఛంద సంస్థ విదేశాల నుంచి 10 లక్షల నిధులను సేకరించకపోతే ఆ సంస్థ యొక్క లైసెన్స్ రద్దు అవుతుంది. అయితే చిన్న, చిన్న సంస్థలకు ఇది ప్రతిబంధకంగా మారుతుందని నిర్వాహకులు గగోలు పెడుతున్నారు.
4. రిజిస్ట్రేషన్ పరిధి. ఏదైనా ఒక సంస్థ ఒక రాష్ట్రంలో గానీ ,కేంద్రపాలిత ప్రాంతంలో గాని రిజిస్ట్రేషన్ అయ్యి వేరే ప్రాంతంలో కార్యకలాపాలు చేపడితే దానిపై చర్యలు తీసుకుంటారు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే అవి కార్యకలాపాలు నిర్వహించాలి.
5. మత ప్రచారం తగదు. విదేశీ నిధులతో మత ప్రచారం , మతమార్పిడి కార్యకలాపాలు చేపడితే ప్రభుత్వం ఆ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటుంది.
6. నిర్వాహకుల బాధ్యతలపై స్పష్టత. సంస్థలో పనిచేసే మేనేజింగ్ డైరెక్టర్లు, చైర్మన్, ట్రస్టు సభ్యులు ఇతరుల బాధ్యతల గురించి రిజిస్ట్రీలో వివరంగా నమోదు చేయాలో. తదుపరి ఏదైనా సందర్భంలో నిబంధనల ఉల్లంఘన జరిగితే బాధ్యులైన వారిపై స్పష్టత వచ్చి వారిపై నిబంధన ప్రకారం చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
శిక్షల్లో సడలింపు ..
నిబంధన ఉల్లంఘించిన స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులపై గతంలో గరిష్టంగా ఐదు సంవత్సరాలు పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉండేది. ఇప్పుడు దాన్ని ఒక సంవత్సరం కాల పరిమితికి తగ్గించారు అదేవిధంగా కేసుల నమోదు విషయంలో కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా తీసుకోవాలని ప్రస్తుత నిబంధనలో పొందుపరిచారు.
కేంద్ర ప్రభుత్వ వివరణ
అసాంఘిక శక్తులకు అక్రమంగా విదేశీ నిధుల సహాయాన్ని అడ్డుకోవటానికే ఈ ఎఫ్ సి ఆర్ ఏ బిల్లులో పలు మార్పులు తీసుకువచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. పారదర్శకంగా విధులు నిర్వహించే స్వచ్ఛంద సంస్థలకు ఏవిధమైన ఇబ్బందులు ఉండవని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఇటీవల తనను కలిసిన చర్చి ఫాదర్ లకుహామీ ఇచ్చారు.
ఎన్జీవోల ఆందోళన
చిన్న చిన్న సాకులతో తమ లైసెన్సులు రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం తమ ఆస్తులను స్వాధీనం చేసుకుంటుందని ఈ బిల్లుపై పునరాలోచన చేయాలని ఎన్జీవోలు కోరుతున్నాయి .అయితే
దేశ భద్రత, సమగ్రతను దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు పెద్ద నోట్ల రద్దు అనంతరం కాశ్మీర్లో సైన్యంపై రాళ్లదాడులు ఆగిపోయాయి. అదేవిధంగా నక్సలిజం కూడా కనుమరుగైంది. దీనికి కారణం ఈ స్వచ్ఛంద సంస్థలపై కఠిన నిర్ణయాలు తీసుకోవటమే. ఇవి సేవ ముసుగులో తీవ్రవాదులకు, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం అందజేస్తూ దేశంలో అల్లకల్లోలన్నీ సృష్టిస్తున్నాయి. 2014లో మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ సంస్థలపై ఉక్కు పాదం మోపడంతో ఇప్పుడు దేశంలో ప్రశాంత వాతావరణ నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా ఈ ఎఫ్ సి ఆర్ ఎ బిల్లుకు మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. జనాల్ని పక్కదారి పట్టించకుండా ఉండాలనే ఉద్దేశంతో సమాజ హితం కోరుతూ ఈ వివరాలను పోస్ట్ చేస్తున్నాను.
ఇలాంటి మరింత సమాచారం కోసం మా
తెలుగు న్యూస్ రూమ్
పేజీని ఫాలో అవ్వండి.
FCRA Bill, FCRA Rules, NGOs, Central Government, BJP Government, Foreign Funding, India News, Latest News, Politics, Social Welfare
#FCRABill2026, #FCRAAmendmentBill, #FCRARules2026, #NGOs, #విదేశీవిరాళాలు, #NGOForeignFunding, #FCRAనిబంధనలు, #FCRARegistration, #10లక్షలFCRARule, #FCRAAssets, #BJPGovernmentFCRABill, #FCRA, #ForeignFunding, #NGOFunding, #FCRAAct, #FCRAAmendment, #IndiaNews, #LatestNews, #CentralGovernment,
#NGONews, #ForeignDonations, #FCRA2026



Comments
Post a Comment