తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

వాయనాట్టు కులవన్ దేవస్థానం – కాసరగోడ్, కేరళ | చరిత్ర, విశేషాలు, తేయ్యం, దర్శన సమాచారం

Image
  సాధారణంగా ఏదైనా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు ,అభిషేకాలు, హోమాలు, జపాలు, కళ్యాణోత్సవాలు ,బ్రహ్మోత్సవాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తే పలు సమస్యల నుంచి బయట పడవచ్చు అని మనం వింటుంటాం కానీ భారతదేశంలోని ఈ ఆలయం మాత్రం ఒక విశిష్టమైన మహా శక్తిని కలిగి ఉంది  ఈ ఆలయ ప్రసాదం మన ఇంట్లో ఉంటే కోర్టు కేసుల నుంచి సులువుగా బయటపడవచ్చు అంతేకాక మన శరీరంలో కడుపుకు సంబంధించిన గ్యాస్ ట్రబుల్, అల్సర్, పేగు పుండులు తదితర సమస్యల నుంచి కూడా సులువుగా నయమవుతాయి.  పై మాటలు చదివి ఇదేదో వింతగా ఉంది అనుకుంటున్నారా కానీ 100% అక్షరాలా నిజం. సుప్రీంకోర్టుకు చెందిన పలువురు కక్షీదారులు ప్రతిరోజు ఢిల్లీ నుంచి ఈ ఆలయానికి వచ్చి ఆలయంలో పూజారి విక్రయించే ప్రసాదాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తారు. ఈ ప్రసాదాన్ని దేవుడి గదిలో ఉంచి ప్రతిరోజు పూజ చేయడం వల్ల మనకు సకల శుభాలు కలుగుతాయి .ఇప్పుడు ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి.  కేరళ రాష్ట్రంలోని కాసరగుడు జిల్లాలో పలు వాయునట్టు కులవన్ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పలక్ శ్రీ వాయునట్టు కులం దేవస్థానం. ఈ దేవతను గ్రామ రక్షకుడిగా పలువురు ఆరాధిస్తారు...

నాగబంధం సినిమా స్టోరీ (2026) | పూర్తి కథ, నటీనటులు, దర్శకుడు, నిర్మాతలు | Nagabandham Telugu Movie Story

 

నాగబంధం ది సీక్రెట్ ట్రెజర్ తెలుగు సినిమా పోస్టర్

నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్ (2026) తెలుగు సినిమా పూర్తి కథ, క్లైమాక్స్, నటీనటులు, దర్శకుడు అభిషేక్ నామా, నిర్మాతలు, విడుదల తేదీ మరియు ఇతర ఆసక్తికర వివరాలను తెలుసుకోండి


పౌరాణిక నేపథ్యంలో.. యాక్షన్ ,అడ్వెంచర్ కు పెద్దపీట వేస్తూ ప్రేక్షకులకు మనోరంజకరమైన అంశాలతో ముడిపడిన సినిమా నాగబంధం. జులై 3న థియేటర్లలో విడుదలై అభిమానుల ఆదరణ పొందుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర కథాంశం, స్క్రీన్ ప్లే, తారాగణం, దర్శకత్వం ,నిర్మాణ సంస్థ తదితర వివరాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ వివరాలు మీకోసం …


దర్శకుడు

అభిషేక్ నామా 


 నిర్మాతలు

కిషోర్ అన్నపురెడ్డి

నిశిత నాగిరెడ్డి 



కథ – స్క్రీన్‌ప్లే

కథ, స్క్రీన్‌ప్లే: అభిషేక్ నామా

సంభాషణలు: కళ్యాణ్ చక్రవర్తి, శ్రవణ్ కుమార్ తడ్కా 


 సంగీతం

అబే

జునైద్ కుమార్ 


 సినిమాటోగ్రఫీ

సౌందర్ రాజన్ 


 ఎడిటర్

ఆర్. సి. ప్రణవ్ 


 ప్రధాన నటీనటులు

విరాట్ కర్ణ – రుద్ర

నభా నటేష్ – పార్వతి

ఐశ్వర్య మేనన్

దక్ష నాగర్కర్ – ప్రియమణి

జగపతి బాబు

మురళీ శర్మ – ఆచ్యుత చారి


కథాంశం 

నాగబంధం ది సీక్రెట్ ట్రెజర్ తెలుగు సినిమా


ఈ సినిమా 19వ శతాబ్దంలోని ఒక పురాతన దేవాలయంలో అష్టదిగ్బంధనం చేసిన శక్తిని దోచుకునేందుకు,....కాపాడుకునేందుకు ..రెండు వర్గాలు చేసే ప్రయత్నాలు.. దుష్టుల నుంచి ఆ శక్తిని రక్షించేందుకు హీరో చేసిన పోరాటాలు తదితర కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.


దేవాలయంలో ఉన్న బ్రహ్మ కమలాన్ని కాపాడేందుకు మహర్షిలు శక్తివంతమైన నాగబంధాన్ని రూపొందించి దాన్ని అష్టదిగ్బంధనం చేస్తారు. శత్రువులు, దుష్ట చేతికి అది చిక్కకుండా శాపాలు ,రహస్య సంకేతాలు అమరుస్తారు. 

నాగబంధం ది సీక్రెట్ ట్రెజర్



చరిత్ర పరిశోధకుడిగా …

హీరో రుద్ర ఒక చరిత్ర పరిశోధకుడు. అతనికి పౌరాణిక శాసనాలు, దేవాలయాలు, వస్తువులపై అమితమైన ఆసక్తి .దాంట్లో భాగంగా పలు తాళపత్ర గ్రంధాలను చదువుతాడు .ఒక తాళపత్ర గ్రంథంలో లభించిన సమాచారం ఆధారంగా ఈ పురాతన దేవాలయంలోని బ్రహ్మ కమలాన్ని కనుక్కోవటానికి వస్తాడు. హీరోయిన్ కూడా అదే నేపథ్యం .ఆమె కూడా ఈ పురాతన అన్వేషణలో భాగంగా ఆ గుడి వద్దకు చేరుకుంటుంది. ఆమె వెంట పలువురు పరిశోధకులు కూడా ఉంటారు. 


ఇదే సమయంలో విలన్ కూడా ఆ ఆలయం వద్దకు చేరుకొని ఆ రహస్య కమలాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తాడు. రహస్య సంకేతాలను విప్పుకుంటూ విరోచిత పోరాటాలతో ఈ మూడు బృందాలు నిధి వద్దకు చేరుకున్న తీరు ఆసక్తి దాయకంగా మనోరంజకంగా ఉంటుంది. 



బ్రహ్మ కమలాన్ని చేరుకునే సమయంలో ఎదురైన ఇబ్బందులను అధిగమించేందుకు పన్నిన పన్నాగాలు, రహస్య యుద్దాల నేపథ్యంలో హీరోకు ,బ్రహ్మ కమలానికి ,తమ కుటుంబానికి మంచి గత జన్మ బంధం ఉందని భావిస్తాడు. అప్పటినుంచి బ్రహ్మ కమలాన్ని తీసుకునే బదులు దాన్ని దుష్టశక్తుల నుంచి కాపాడేందుకు వీరోచిత పోరాటం చేస్తాడు. అందరి సహకారంతో ఆ బ్రహ్మ కమలాన్ని ఒక శక్తి కేంద్రంగా మారుస్తారు. 


సినిమా చిత్రీకరణ నేపథ్యం ,ఫోటోగ్రఫీ, వి ఎఫ్ ఎక్స్ మ్యూజిక్, bgm ప్రేక్షకులను కనురెప్ప కూడా వేయనీయవు. ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి ఒక్కరూ తన్మయత్వంలో ప్రతి దృశ్యాన్ని తమకు అన్వయించుకుంటారు. 


ప్రతి ఒక్కరూ కుటుంబంతో సహా ఈ సినిమాను వీక్షించవచ్చు. తెలుగు చిత్ర సీమ లో చాలా రోజుల తర్వాత ఇలాంటి చిత్రాన్ని దర్శక, నిర్మాతలు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. 


ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ రోజే మీ టికెట్ను బుక్ చేసుకోండి. కుటుంబంతో సహా కలిసి వెళ్లి ఆనందించండి. 



ట్విస్ట్ 

సినిమా కథను బట్టి చూస్తే దర్శక,నిర్మాతలు పార్ట్ 2కు కూడా ప్రణాళికలు రూపొందించాలని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై ఒక ప్రకటన విలువడే అవకాశం ఉంది .అది కూడా పార్ట్ వన్ లాగా జన రంజికంగా ఉంటుందని ఆశిద్దాం.


ఇలాంటి మరింత సమాచారం కో

సం మా తెలుగు న్యూస్ రూమ్ పేజీని ఫాలో అవ్వండి. 







Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్