తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు

Image
 FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది. విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.  1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.  తొలుత ఉన్న...

రాత పరీక్ష మెరిట్ మార్కులతో 984 పోస్టుల భర్తీ | తాజా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ 2026


రాత పరీక్ష మెరిట్ మార్కులతో 984 పోస్టుల భర్తీ ఉద్యోగాల నోటిఫికేషన్ 2026 థంబ్‌నెయిల్


 రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా 984 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ, ముఖ్యమైన తేదీలను తెలుసుకోండి.


సాధారణంగా ఒక ఉద్యోగం సాధించాలంటే ఒకటికి రెండు సార్లు రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు, యూనిఫాం సర్వీసుల కైతే ఫిజికల్ టెస్ట్లు మెడికల్ రిపోర్టులు కంపల్సరీ. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాతపరీక్షతోనే గవర్నమెంట్ ఉద్యోగం సాధించే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది ఆ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా. 


 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రాత పరీక్ష అనంతరం నిర్వహించే మౌఖిక పరీక్షలు (ఇంటర్వ్యూలు) అక్రమాలకు కేంద్రంగా మారాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ పరీక్షలకు ఇంటర్వ్యూలను ఎత్తివేసింది. ఇదే విధానాన్ని అన్ని ప్రభుత్వ పరీక్షల భర్తీలోనూ కొనసాగించాలని సీఎం నిర్ణయించారు. 


బోధనా పోస్టుల భర్తీకి..


ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు రాష్ట్ర పశు వైద్య విశ్వవిద్యాలయాల్లో 984 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది దీనిలో భాగంగా పోస్టుల భర్తీ కోసం ముఖ్యమంత్రి నిర్ణయాన్ని కోరుతూ పంపిన నివేదికలో సీఎం రాత పరీక్ష ఆధారంగానే ఉద్యోగాలు భర్తీ చేయాలని సూచించారు. నియామకాల్లో ఎటువంటి అక్రమాలకు తావివ్వకూడదని ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మాటలు నిరుద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. 


ఉద్యానవర్సిటీలో ..

ఉద్యానవసిటీలో ఇటీవల 79 అసిస్టెంట్, 44 అసోసియేట్ ప్రొఫెసర్, 17 ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు . వీటికి కూడా ఇంటర్వ్యూలు రద్దు చేయాలని తీర్మానించారు. 


త్వరలో నోటిఫికేషన్ ..

ఇంటర్వ్యూ లేకుండా 550 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు అగ్రి వర్సిటీ వీసీ జానయ్య తెలిపారు. ఉద్యాన,పశు వైద్య విశ్వవిద్యాలయంలోనూ ఇదే విధానాన్ని అనుసరించునున్నారు. పీవీ నరసింహారావు పశువైద్యవిద్యాలయంలో బ్యాక్ లాగ్ ,కొత్త పోస్టులు కలిపి మొత్తం 294 పోస్టులను ఇదే తరహాలో భర్తీ చేయనట్లు అధికారులు తెలిపారు. 


సహజంగా ఇంటర్వ్యూల సమయంలో పలుకుబడి ఉన్న అభ్యర్థులు మెరిట్ అభ్యర్థుల కడుపు కొడుతుంటారు. వీరు తమకున్న రాజకీయ, ఆర్థిక పలుకుబడినీ ఉపయోగించి మెరిట్ అభ్యర్థులను దాటి ఉద్యోగాలు సంపాదిస్తుంటారు. ఇది టాలెంట్ ఉన్న అభ్యర్థులకు నిరుత్సాహాన్ని గురిచేస్తుంది .రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో టాలెంట్ ఉన్న అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కైవసం చేసుకోనున్నారు. 


ఇంకెందుకు ఆలస్యం ఇప్పటినుంచి పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు కష్టపడి చదవండి ఆల్ ది బెస్ట్.


ఇలాంటి మరింత సమాచారం కోసం మా 

తెలుగు న్యూస్ రూమ్ పేజీ

ని ఫాలో అవ్వండి


#రాత పరీక్ష మెరిట్ మార్కులు

#984 పోస్టుల భర్తీ

#Government Jobs 2026

#Latest Jobs Telugu

#Merit Based Recruitment

#Govt Jobs Notification

#ఉద్యోగాల నోటిఫికేషన్

#రాత పరీక్ష ఉద్యోగాలు



Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

నాగబంధం సినిమా స్టోరీ (2026) | పూర్తి కథ, నటీనటులు, దర్శకుడు, నిర్మాతలు | Nagabandham Telugu Movie Story