తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు

Image
 FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది. విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.  1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.  తొలుత ఉన్న...

మీరు వెళ్లే రైలు 3 గంటలు ఆలస్యమైతే రిఫండ్ వస్తుందా? ఇండియన్ రైల్వే పూర్తి నిబంధనలు

 మీరు వెళ్లే రైలు మూడు గంటలు ఆలస్యమైతే 

మీ టిక్కెట్ రిఫండ్ వస్తుందా .

రైల్వే స్టేషన్‌లో ఆలస్యమైన రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు – రైలు 3 గంటలు ఆలస్యమైతే రిఫండ్ నిబంధనలు.



2014 ముందు వరకు భారతీయ రైల్వే అంటే ఆలస్యానికి ప్రతిరూపం. ఏ సమయంలో ఏ రైలు ఏ స్టేషన్లో ఉంటుందో తెలియని పరిస్థితి .మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక ఈ పరిస్థితుల్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. ట్రాక్లను మార్చి వేగ పరిమితిని పెంచటం, అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ,సిబ్బంది నియామకం, వందే భారత్ రైళ్ల ప్రవేశంతో భారతీయ రైల్వే రూపురేఖలు మారిపోయాయి .


దేశవ్యాప్తంగా ఉన్న వేలాది రైళ్లు ప్రతిరోజు 90% వరకు అనుకున్న సమయానికి గమ్యస్థానాలకు చేరుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ట్రాక్ల మరమ్మత్తులు, వాతావరణ మార్పులు ….ఉదాహరణకు భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడటం, అడవి ప్రాంతాల్లో రైలు పట్టాలు దాటుతూ అడవి జంతువులు రైలు కిందపడి దుర్మరణం చెందడం, ప్రజల ఆత్మహత్యలు ,పట్టాల మధ్య ఉన్న కప్లింగ్ లు లూస్ అవ్వటం, నేర చర్యలు తదితర కారణాలతో కొన్ని రైళ్లు ఆలస్యం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రయాణికులకు టికెట్ చేసేందుకు వీలుగా రైల్వే శాఖ టిడిఆర్ టికెట్ డిపాజిట్ రిసిప్ట్ విధానాన్ని ప్రవేశపెట్టింది.

రైలు 3 గంటలు ఆలస్యమైతే రిఫండ్ నిబంధనలు.


మూడు గంటలకు మించి ఆలస్యమైతే ..

మనం వెళ్లాల్సిన రైలు మూడు గంటల కు మించి ఆలస్యం అయితే గతంలో ప్రయాణికులు తమ డబ్బులను వదులుకొని ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకునేవారు. దీనిపై విమర్శలు రావడంతో రైల్వే శాఖ ఒక రిఫండ్ స్కీంను ప్రవేశపెట్టింది. అదే టి డి ఆర్. దీన్ని ఉపయోగించుకొని ఎవరైనా రైలు ప్రయాణం ఆలస్యం అయినప్పుడు రిఫండ్ను పొందవచ్చు 


నియమ నిబంధనలు …

1.తాము వెళ్లాల్సిన రైలు టికెట్ బుక్ చేసుకున్న స్టేషన్ నుంచి మూడు గంటలకు పైగా ఆలస్యం అవ్వా లి. అదే సమయంలో ప్రయాణికుడు తన ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలో.. అప్పుడే ఈ రిఫండ్ పొందటానికి అర్హులవుతారు .


2.రైలు రద్దు అయిన కొన్ని సందర్భాల్లో, రైళ్లు మార్గం మారి నా ఈ రిఫండ్ పొందటానికి అవకాశం ఉంటుంది 

3.మీరు ఏసీ కోచ్ లో టికెట్ బుక్ చేసుకున్నారు. అనివార్య కారణాల వల్ల రైల్వేలో ఆ ఏసీ కంపార్ట్మెంట్లో తక్కువ ఉండి మిమ్మల్ని స్లీపర్లో జర్నీ చేయమని కోరితే ఆ సమయంలో కూడా మీరు టికెట్ క్యాన్సిల్ చేసుకుని రిఫండ్ పొందటానికి అర్హులవుతారు. 

4.నిర్వహణ లోపాల కారణంగా భారతీయ రైల్వేలో ప్రతిరోజు పదుల సంఖ్యలో కంపార్ట్మెంట్లలో ఏసీలు మరమ్మతులకు గురవుతున్నాయి ఈ నేపథ్యంలో కూడా ప్రయాణికులు ఈ రిఫండ్ పొందటానికి వీలుంటుంది. 


ఈ రైళ్లలో ఈ సమయంలో ప్రత్యేక సౌకర్యాలు ..

రాజధాని, శతాబ్ది, దూరంతో ప్రీమియం రైలు రెండు గంటలకు పైగా ఆలస్యమైతే ఆ రైలు టికెట్ బుక్ చేసుకున్న వారికి ఉచితంగా టిఫిన్ లేదా భోజనం పొందే అవకాశం ఉంటుంది. 

రైలు 3 గంటలు ఆలస్యమైతే రిఫండ్ నిబంధనలు.


రిఫండ్ పొందండి ఇలా ...

1. ముందుగా ఐఆర్సిటిసి వెబ్సైట్లో లాగిన్ కావాలి. 

2. అనంతరం టి డి ఆర్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి 

3. మీ టికెట్ పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేయాలి 

4. టికెట్ రద్దు చేసుకోవడానికి గల కారణాలను సెలెక్ట్ చేయాలి 

5. మీతోపాటు ఎంతమంది ప్రయాణిస్తున్నారో వారి వివరాలు కూడా నమోదు చేయాలి 

6. అన్ని వివరాలు పక్కాగా నమోదు చేయగానే సబ్మిట్ అని క్లిక్ చేయాలి 


గడువు సమయం 

1. రైలు బయలుదేరిన సమయం నుంచి 72 గంటల్లోపు టిడిఆర్ కు దరఖాస్తు చేయాలి. 

2. ఏసీ పనిచేయని సందర్భంలో గమ్యస్థానానికి చేరుకున్న వెంటనే టి డి ఆర్ కు దరఖాస్తు చేసుకోవాలి. 


గుర్తుంచుకోవాల్సిన విషయాలు ..

ప్రతి ఆలస్యానికి టీడీఆర్ అనేది రాదు. రైల్వే శాఖ నియమ నిబంధనలు అనుసరించే ఈ సౌకర్యం వినియోగించుకునే అవకాశం ఉంటుంది. రైల్వే శాఖ వారు ముందస్తుగా ప్రకటించిన రైళ్ల రద్దు, రూట్ల మార్పు తదితర సమయాల్లో ఈ టీడీఆర్ స్కీమ్ అనేది వర్తించదు. ప్రయాణికులు రైల్ టికెట్ బుక్ చేసుకున్న దగ్గర్నుంచి రైల్వే శాఖ వారు విడుదల చేసే ప్రకటనలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. 


మీ ప్రయాణం సుఖమయం అవ్వాలని కోరుతూ సెలవు.


భారతీయ రైల్వే ప్రపంచ స్థాయిలో ప్రయాణికులకు నెంబర్ వన్ గా సేవలందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.


ఇలాంటి మరింత సమాచారం కోసం మా తెలుగు న్యూస్ రూమ్ 

పేజీని ఫాలో అవ్వండి. 









Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

నాగబంధం సినిమా స్టోరీ (2026) | పూర్తి కథ, నటీనటులు, దర్శకుడు, నిర్మాతలు | Nagabandham Telugu Movie Story