తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు

Image
 FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది. విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.  1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.  తొలుత ఉన్న...

దేశవ్యాప్తంగా వాతావరణ శాఖ హెచ్చరిక..




దేశంలోని పలు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా  కదులుతున్నాయి. మారుతున్న  వాతావరణం నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


దక్షిణ, పశ్చిమ, మధ్య భారతాల్లో...

దక్షిణ భారతంలోని కొన్ని రాష్ట్రాలతో పాటు పశ్చిమ, మధ్య భారత ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


లోతట్టు ప్రాంతాల ప్రజలకు అప్రమత్తత..

భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడే అవకాశం ఉందని, అత్యవసర పరిస్థితులు తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదని అధికారులు సూచించారు. రైతులు కూడా స్థానిక వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలని కోరారు.


ప్రజలకు సూచనలు

- వాతావరణ శాఖ తాజా హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించండి.

- ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో చెట్ల కింద నిలబడవద్దు.

- భారీ వర్షాల సమయంలో కారు ,ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు వాటిని  రోడ్డు పక్కన ఆపేసి మీరు కాంక్రీట్ భవనాల్లో తల దాచుకోండి. 

- రహదారులపై విద్యుత్ తీగలపడిన చోట,మ్యాన్ హోల్స్ దగ్గర అప్రమత్తంగా ఉండండి .చిన్నారులను ఇంటి నుంచి బయటికి పంపవద్దు.


ఇలాంటి మరింత సమాచారం కోసం మా తెలుగు న్యూస్ రూమ్ 

పేజీని ఫాలో అవ్వండి

Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

నాగబంధం సినిమా స్టోరీ (2026) | పూర్తి కథ, నటీనటులు, దర్శకుడు, నిర్మాతలు | Nagabandham Telugu Movie Story