తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు

Image
 FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది. విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.  1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.  తొలుత ఉన్న...

త్వరలో ఐఫోన్ ధరల పెంపు

 మరో మూడు నెలల్లో ఐఫోన్- 18 సిరీస్ మోడల్ మార్కెట్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆ ఫోన్ ధరల పెంపుపై మార్కెట్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటికి తెరదించుతూ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఒక ప్రకటన విడుదల చేశారు.


పదవీ విరమణ సమయంలో .. 



యాపిల్ సీఈఓ గా కుక్ త్వరలో పదవి విరమణ చేయనున్నారు .ఆయన స్థానంలో జాన్టర్నస్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధరల పెంపు భారాన్ని కూడా తన భుజాల మీద వేసుకునేందుకు సిద్ధమయ్యారు టిమ్ .అందులో భాగంగానే ఆయన ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు. ఐఫోన్ 18 మోడల్స్ ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు..


విడిభాగాల ధరలు పెరిగిన నేపథ్యంలో..



ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ చిప్ లకు కొరత ఏర్పడింది. అంతేగాక విడిభాగాల ధరలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. ముడి సరకులు సరఫరా చేసే సంస్థలు కూడా చేతులు ఎత్తేస్తున్నాయి. ఇరాక్ -ఇజ్రాయిల్ వార్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థ చిన్నాభిన్నమైంది .అనుకున్న సమయానికి ముడి పదార్థాలను గమ్యస్థానాలకు చేరవేయ లేకపోతున్నారు. ఇది క్రమేనా వస్తువుల ధరలు పెరుగుదలకు కారణమైంది. 


ఎక్కువ రోజులు భరించలేం …

సరఫరా వ్యవస్థ దెబ్బ తినడంతో ప్రతి చిన్న భాగం ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి .ఈ భారాన్ని ఎక్కువ రోజులు మోయ లేమని టిమ్ కుక్ చెప్పుకొచ్చారు.


150 డాలర్ల మేర...

పెరిగిన ముడి పదార్థాల ధరల నేపథ్యంలో ఐఫోన్ 18 తయారీకి అదనంగా 150 డాలర్ల భారం పడుతుందని టిమ్ చెప్పారు. మరి వినియోదారులపై ఎంత భారం మోపుతారో చూడాలంటే కొన్ని రోజులు పాటు వేసి ఉండక తప్పదు. 

నేను కూడా మీలాగే ఐఫోన్- 18 మోడల్ కోసం వెయిట్ చేస్తున్నాను .అందులో ఫీచర్లు ఎంత ఎట్రాక్టివ్ గా ఉంటాయో తెలుసుకోవాలని తహతహలాడుతున్నాను.


ఇలాంటి మరింత సమాచారం కోసం మా

 తెలుగు న్యూస్ రూమ్

 పేజీని ఫాలో అవ్వండి.


Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్