తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

తొలి ఏకాదశి 2026 ఎప్పుడు? విశిష్టత, పూజా విధానం, నైవేద్యాలు, ఉపవాస నియమాలు – పూర్తి వివరాలు

Image
  తొలి ఏకాదశి -2026 విశిష్టత పూజా విధానం  ఆరోజు చేయాల్సిన పనులు. శ్రీ మహా విష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి జారుకునే రోజే తొలి ఏకాదశి. నాలుగు నెలల తర్వాత వచ్చే ఉత్తాన ఏకాదశి రోజు ఆయన నిద్ర లేస్తాడు.  శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు కాబట్టే తొలి ఏకాదశి ఆ సంవత్సరంలో కెల్లా అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. 2026 వ సంవత్సరం జూలై 25 వ తేదీన తొలి ఏకాదశి వస్తుంది. శుభాల కలయిక ఆరోజు ఉపవాస ఉండి శ్రీమహావిష్ణువు పూజిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.  ఆర్థిక సమస్యలు తీరుతాయి . ఆ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది . చాతుర్మాస దీక్షల ప్రారంభానికి మంచి రోజు.  ఆరోజు చేయాల్సిన పనులు … ఆరోజు వేకువ జామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి. పూజ గదిని శుభ్రం చేసి దీపం వెలిగించాలో.శ్రీమహావిష్ణువుని ,శ్రీకృష్ణుడు , శ్రీరాముల వారిని పూజించాలి. ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండాలి. షుగర్ పేషెంట్లు ఉపవాసాలకు దూరంగా ఉంటే మంచిది.  ఆ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చదివితే జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుంది.  జపించాల్సిన మంత్రం  ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 స...

దోచుకున్న డబ్బులు తిరిగి ఇస్తాను అందరూ వచ్చి తీసుకెళ్లండి


దీదీకి దిమ్మ తిరిగింది



 పశ్చిమబెంగాల్.. భారతదేశ తూర్పు తీర రాష్ట్రమైన ఈ పశ్చిమ బెంగాల్ ని గత దశాబ్దం పాటు మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా పాలించారు. ఆ సమయంలో రాష్ట్రంలో పాలన గాడి తప్పింది .అవినీతి, అక్రమాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. మహిళలకు, యువతలకు రక్షణ లేకుండా పోయింది .ఈ నేపథ్యంలో టీఎంసీ పార్టీ పై ,మమతా బెనర్జీ పై బెంగాల్ ప్రజలు అసంత్రుప్తి చెందారు.


కమల వికాసంతో 



ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 208 స్థానాల్లో విజయం సాధించి బెంగాల్ ను కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రిగా సురేందు అధికారి బాధ్యతలు తీసుకున్నాక పాలనలో మార్పులు తీసుకొచ్చారు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయటంతో పాటు రాష్ట్రంలో శాంతిభద్రతలపై దృష్టి సారించారు. రౌడీలు, గుండాలు హంతకులపై ఉక్కు పాదం మోపుతున్నారు. అంతేకాక గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడి కోట్లు సంపాదించిన వారిపై కేసులు పెట్టి విచారణ చేస్తున్నారు .వారి అవినీతిని బయటకు తీసి శిక్షలు పడేలా చేస్తున్నారు. 


అక్రమార్కుల వెన్నులో వణుకు 



మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ చేసిన అక్రమాల కారణంగా అతనిపై పలు నేరాలను నమోదు అయ్యాయి. దీనిలో భాగంగా అక్కడే ప్రత్యేక దర్యాప్తు బృందాలు విచారణ చేస్తున్నాయి. కేసు దర్యాప్తులో పలువురూ రాజకీయ నాయకులు, అధికారుల అక్రమాలు బయటికి రావడంతో కిందిస్థాయి నాయకులు బెంబేలెత్తిపోతున్నారు .పెద్దల పరిస్థితి ఇలా ఉంటే తమ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుందని ఆందోళన చెందుతున్నారు .ఈ నేపథ్యంలో పలువురు గత పదేళ్లలో జనాలు దగ్గర వసూలు చేసిన సొమ్మును తిరిగి ఇచ్చేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. 


పేదలకు ఇళ్ల కేటాయింపులు 


కేంద్ర ప్రభుత్వ పథకం అయినా ఇళ్ల కేటాయింపులో టీఎంసి నాయకులు అక్రమాలకు పాల్పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేశారు .కొన్నిచోట్ల డబ్బులు తీసుకొని ఇల్లు కేటాయించారు. ఈ నేపథ్యంలో బడుగు బలహీన వర్గాల వారి నుంచి అందిన కాడికి దండుకొని వారిని లబ్ధిదారులుగా చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారటం ,అక్రమార్కులపై దర్యాప్తు ప్రారంభించడంతో వీరు వణికి పోతున్నారు. ఎందుకైనా మంచిదని చెప్పి ప్రజల దగ్గర్నుంచి వసూలు చేసిన డబ్బులను రూపాయితో సహా తిరిగి ఇవ్వాలని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 


గ్రామాల్లో ఆటోల్లో ప్రచారం 


గత మమతా బెనర్జీ పాలన సమయంలో నేను పలువురి పేదల దగ్గర నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేశాను. ఎవరైతే నాకు డబ్బులు ఇచ్చారో వాళ్లంతా జూన్ 4న పంచాయతీ కార్యాలయానికి వచ్చి తమ డబ్బులు తీసుకెళ్లాలని బెంగాల్ లోని ఒక జిల్లాకు చెందిన సర్పంచి ఇటీవల మైక్ లో ప్రచారం చేశాడు .ఆ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 


రెండు కోణాల్లో 

పై వీడియో మమతా బెనర్జీ పాలనలో జరిగిన అక్రమాలను .. ప్రస్తుత భాజపా సర్కార్ అవినీతిపరులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఉదాహరణలతో వివరిస్తుంది. ఏది ఏమైనా టీఎంసీ నాయకులు, కార్యకర్తలు సంపాదించిన ప్రతి పైసా వసూలు చేయాలని ప్రజలు కోరుతున్నారు .భాజపా కూడా అదే పనిలో ఉంది. ఏది ఏమైనా పశ్చిమ బెంగాల్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 


సువేందో అధికారి తన పనితీరుతో మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, tmc నాయకులు, కార్యకర్తల గుండెల్లో నిద్రపోతున్నారు. 


అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసి బెంగాల్లో సుభిక్ష పాలన అందించే దిశగా ముందుకు తీసుకెళుతున్నారు. 


ఆయన ఆశయం నెరవేరాలని మనందరం కోరుకుందాం 


ఇలాంటి మంచి సమాచారం కోసం మా తెలుగు న్యూస్ రూమ్ 

పేజీని ఫాలో అవ్వండి.

Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్