తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు

Image
 FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది. విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.  1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.  తొలుత ఉన్న...

జూన్ 26 నుంచి తిరుమలలో సాల కట్ల జేష్ఠాభిషేకం

 



పలు రకాల సేవలు రద్దు..

కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏటా సాల కట్ల జేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకలను పురస్కరించుకొని జూన్ 28న కొన్నిరకాల సేవలను రద్దు చేశారు. 


ఆనవాయితీ ప్రకారం …

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా ఘనంగా, మూడు రోజులు పాటు నిర్వహిస్తారు. జేష్ట నక్షత్రం ముగిసేలా ఈ అభిషేక ఉత్సవాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. 


ఉత్సవమూర్తుల రక్షణ కోసం..



నిత్యం జరిగే వివిధ రకాల అభిషేకాలు, పూజల నుంచి ఈ అభిషేక విగ్రహాలు అరిగిపోకుండా చూడడమే ఈ ఉత్సవ ప్రత్యేకత. ఈ మూడు రోజులు పాటు స్వామి వారి విగ్రహాలకు ప్రత్యేక కవచాలు సమర్పిస్తారు. 


జూన్ 26 (మొదటిరోజు)..

శ్రీ మల్లప్ప స్వామికి సంవత్సరం పొడవునా ఉన్న పాత కవచాన్ని తొలగిస్తారు. ఆ తర్వాత స్నాపన తిరుమంజనం (పవిత్ర స్నానం) నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి వజ్ర కవచాన్ని అలంకరించి పూజలు చేస్తారు. 


జూన్ 27 (రెండో రోజు)...

రెండో రోజు ప్రత్యేక తిరుమంజనాధి కార్యక్రమాలు ముగిసిన తర్వాత స్వామివారికి ముత్యాల కవచాన్ని తొడుగుతారు. 


జూన్ 28 (మూడోరోజు)..



చివరి రోజు స్వామివారికి సంప్రదాయ రీతిలో తిరుమంజనాది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు అనంతరం బంగారు కవచాన్ని తొడుగుతారు

ఈ బంగారు కవచాన్ని స్వామివారికి ఏడాది పొడవునా ఉంచుతారు .మళ్ళీ సాలకట్ల జేష్ఠోత్సవం వచ్చినంత వరకు ఉంచుతారు. అప్పటివరకు జరిగే అభిషేకాలు, పూజలు అన్ని అదే కవచంపై నిర్వహిస్తారు. 


జూన్ 28 ఆర్జిత సేవలు రద్దు 


సాలకట్ల జేష్ఠభిషేక ఉత్సవాలను పురస్కరించుకొని చివరి రోజైన జూన్ 28న పలు రకాల సేవలను రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రకటించారు .

ఆ సేవలు ఇవే..

కళ్యాణోత్సవం 

ఉంజల్ సేవ 

ఆర్చిత బ్రహ్మోత్సవాలు..


పై సేవల టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు ఈ మార్పును గమనించి దానికి అనుగుణంగా తమ దర్శన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. ఆలయ నిబంధనలకు అనుగుణంగా వారికి దర్శనం కల్పిస్తామని ప్రకటించారు.

భక్తులందరికీ తిరుమల వెంకటేశ్వరుని కరుణాకటాక్షాలు లభించాలని కోరుకుంటున్నాం.


ఇలాంటి మరింత సమాచారం కోసం మా 

తెలుగు న్యూస్ రూమ్

 పేజీని ఫాలో అవ్వండి.








Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్