తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు

Image
 FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది. విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.  1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.  తొలుత ఉన్న...

వెంకన్న భక్తులకు అద్భుత అవకాశం

 



     

ఒక్క టికెటు …మూడుసార్లు దర్శనాలు…


కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామినిదర్శించుకోవాలన్నది ప్రతి భక్తుడి కోరిక .ఒక్కసారి ఆ దైవాన్ని కనురాల చూస్తే జన్మ ధన్యమైంది అని భావిస్తారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రవేశపెట్టిన ఒక నూతన పథకంతో ఒక టికెట్ పై మూడుసార్లు స్వామివారిని దర్శించుకోవచ్చు.


 అదే పవిత్రోత్సవం టికెట్


తిరుమలలో ఆగస్టు 23 నుంచి 25వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగుతాయి. ఆగస్టు 22న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి .ఏడాది పొడవునా ఆలయంలో జరిగే పూజల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతాయి. ఈ కారణంగా ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా ఈ వేడుకలు నిర్వహిస్తారు .ఈ సేవలో పాల్గొనే వారు ఈ నెల 21న ఆన్లైన్లో జారీ చేసే టికెట్లను కొనుగోలు చేయాలి.ఉదయం 10 గంటలకు విడుదల చేసే ఈ టికెట్ ధరను ఇద్దరికి కలిపి 5000గా నిర్ణయించారు .టికెట్లు పొందిన భక్తులు పవిత్రోత్సవాలు జరిగే మూడు రోజులు స్స్నాపన తిరుమంజనంలో,మూడోరోజు జరిగే పూర్ణాహుతిలో పాల్గొనవచ్చు 

ఇంకెందుకు ఆలస్యం .. ఇప్పటి నుంచే ఆ టికెట్లు పొందేందుకు సమాయత్తం అవ్వండి.

ఇలాంటి మరింత సమాచారం కోసం తెలుగు న్యూస్ రూమును ఫాలో

 అవ్వండి

Comments

Post a Comment

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

నాగబంధం సినిమా స్టోరీ (2026) | పూర్తి కథ, నటీనటులు, దర్శకుడు, నిర్మాతలు | Nagabandham Telugu Movie Story