తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు

Image
 FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది. విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.  1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.  తొలుత ఉన్న...

విరాళాలు ఇచ్చే దాతలకు శ్రీవాణి టికెట్టు

 




  తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాలు 


శ్రీవాణి టికెట్ల కేటాయింపులో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక మార్పులు చేసింది. ఎవరైతే స్వామివారికి విరాళాలు ఇచ్చి దర్శనం కోసం వేచి ఉంటారో వారికి కొంత మేర శ్రీవాణి టికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది.



కేటాయింపులు ఇలా 

ప్రతిరోజు సుమారు 1500 శ్రీవాణి టికెట్లను అధికారులు జారీ చేస్తున్నారు .వీటిలో 500 ఆన్లైన్లో,, 200 టికెట్లు రేణిగుంట విమానాశ్రయంలో విక్రయిస్తున్నారు. మిగిలిన టిక్కెట్లను కరెంటు బుకింగ్ ద్వారా కేటాయిస్తున్నారు. ఈ టిక్కెట్లలో 300 టికెట్లను దాతలకు కేటాయిస్తారు


అర్హత

2025 మే ఒకటో తేదీ నుంచి విరాళాలు అందించిన దాతలు ఈ టికెట్లు పొందడానికి అర్హులు.


ఈ విధానం అమలయ్యే తేదీ 

జూన్ 10 నుంచి  టికెట్ల జారీ… దర్శన వేళలు 

ప్రతిరోజు ఉదయం 9 గంటలకు 300 టికెట్లు ఆన్లైన్ లో కేటాయిస్తారు .భక్తులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ టికెట్లు పొందాలి అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు వారికి శ్రీవారి దర్శనం లభిస్తుంది. ఒకవేళ ఈ టికెట్లు గనుక మిగిలిపోతే వాటిని శ్రీవాణి కరెంట్ బుకింగ్ లో విక్రయిస్తారు. 


ఎప్పటి వరకు అమలు 

2027 మార్చి 31 వరకు 


భక్తులందరికీ ఆ శ్రీనివాసుని దర్శన కటాక్షం కలగాలని కోరుతూ 


🙏ఓం నమో వెంకటేశాయ 🙏


ఇలాంటి మరింత సమాచారం కోసం మా తెలుగు న్యూస్ రూమ్

పేజీని ఫాలో అవ్వండి.


Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

నాగబంధం సినిమా స్టోరీ (2026) | పూర్తి కథ, నటీనటులు, దర్శకుడు, నిర్మాతలు | Nagabandham Telugu Movie Story