తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు

Image
 FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది. విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.  1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.  తొలుత ఉన్న...

తలనీలాల సమర్పణలు రికార్డులు తిరగ రాసిన తిరుమల తిరుపతి దేవస్థానం

 


వెంకటేశ్వరుని సన్నిధిలో


కలియుగ వైకుంఠం ,భక్తుల కోరికలు తీర్చే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామినీ ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. తమ కోరికలు తీర్చి జీవితంలో సుఖసంతోషాలు ప్రసాదించాలని వేడుకుంటారు. ఆ కోరికలు నెరవేరితే మళ్ళీ కొండకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారు. 


ఏటా తిరుమలలో తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య పెరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే ఆ వెంకటేశ్వరుడు భక్తుల కోరికల్ని వెంటనే నెరవేరుస్తున్నాడని అర్థం. 


స్వామివారి ఆజ్ఞ ప్రకారం భక్తులు కూడా కోరికలు తీరిన వెంటనే కాలిమార్గాన కొండకు చేరుకొని తలనీనాలు సమర్పిస్తున్నారు. అయితే ఈ ఏడాది తలనీలాల సమర్పణలో తిరుమల తిరుపతి దేవస్థానం తన రికార్డును అధిగమించింది. 


గత ఐదు నెలల్లో ..

గత ఐదు నెలల స్వామి వారికి 12 లక్షల మందికి పైన తలనీలాలు సమర్పించారు .ఈ ఏడాది మే 27 నాటికి 12.43 లక్షల మంది తలనీలాలు సమర్పించినట్టు దేవస్థానం రికార్డులు చెబుతున్నాయి. 2024 మే నాటికి 10.65 లక్షలు మంది తలనీనాలు ఇచ్చారు .ఇదే ఇప్పటివరకు రికార్డు. 2025 లో 10.18 లక్షల మంది ఇవ్వగా 2026 లో రెండు లక్షల మంది అధికంగా తలనీలాలు సమర్పించారు .


ఏది ఏమైనా పడితే తిరుమల వెంకన్న సన్నిధిలో స్వామివారిని కనులారా దర్శించి కోరిన కోరిక నెరవేరుతున్నది అనడానికి ఇదే ఒక ఉదాహరణ. 


అందరికీ ఆ తిరుమల వెంకటేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరుతూ..


🙏 ఓం నమో వెంకటేశాయ 🙏


ఇలాంటి మరింత సమాచారం కోసం మా తెలుగు న్యూస్ రూమ్ 

పేజీని ఫాలో అవ్వండి.



Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

నాగబంధం సినిమా స్టోరీ (2026) | పూర్తి కథ, నటీనటులు, దర్శకుడు, నిర్మాతలు | Nagabandham Telugu Movie Story