తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

వాయనాట్టు కులవన్ దేవస్థానం – కాసరగోడ్, కేరళ | చరిత్ర, విశేషాలు, తేయ్యం, దర్శన సమాచారం

Image
  సాధారణంగా ఏదైనా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు ,అభిషేకాలు, హోమాలు, జపాలు, కళ్యాణోత్సవాలు ,బ్రహ్మోత్సవాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తే పలు సమస్యల నుంచి బయట పడవచ్చు అని మనం వింటుంటాం కానీ భారతదేశంలోని ఈ ఆలయం మాత్రం ఒక విశిష్టమైన మహా శక్తిని కలిగి ఉంది  ఈ ఆలయ ప్రసాదం మన ఇంట్లో ఉంటే కోర్టు కేసుల నుంచి సులువుగా బయటపడవచ్చు అంతేకాక మన శరీరంలో కడుపుకు సంబంధించిన గ్యాస్ ట్రబుల్, అల్సర్, పేగు పుండులు తదితర సమస్యల నుంచి కూడా సులువుగా నయమవుతాయి.  పై మాటలు చదివి ఇదేదో వింతగా ఉంది అనుకుంటున్నారా కానీ 100% అక్షరాలా నిజం. సుప్రీంకోర్టుకు చెందిన పలువురు కక్షీదారులు ప్రతిరోజు ఢిల్లీ నుంచి ఈ ఆలయానికి వచ్చి ఆలయంలో పూజారి విక్రయించే ప్రసాదాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తారు. ఈ ప్రసాదాన్ని దేవుడి గదిలో ఉంచి ప్రతిరోజు పూజ చేయడం వల్ల మనకు సకల శుభాలు కలుగుతాయి .ఇప్పుడు ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి.  కేరళ రాష్ట్రంలోని కాసరగుడు జిల్లాలో పలు వాయునట్టు కులవన్ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పలక్ శ్రీ వాయునట్టు కులం దేవస్థానం. ఈ దేవతను గ్రామ రక్షకుడిగా పలువురు ఆరాధిస్తారు...

🔥 రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. తిరుమలలో భక్తుల వెల్లువ!

 



ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సహకారంతో..


కలియుగ వైకుంఠం, కోరిన కోరికలు తీర్చే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. వేసవి సెలవు నేపథ్యంలో కర్ణాటక ,తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు దర్శన విధానంలో కొత్త మార్పులు తీసుకొచ్చారు. ఇది ఆశించిన సత్ఫలితాన్ని ఇస్తుంది.


గతంలో భక్తుల దర్శనానికి మాన్యువల్ విధానాన్ని పాటించేవారు. సిబ్బంది ద్వారా రద్దీ ఎక్కడ ఉందో తెలుసుకొని ఆ క్యూ లైన్ ముందు వదిలేవారు. ప్రస్తుత అవసరాల నేపథ్యంలో ఈ విధానం ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు .తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఐసీసీకి రూపకల్పన చేశారు. నడక మార్గం, మెట్ల మార్గం లో ఎంత మంది భక్తులు తిరుమలకు వస్తున్నారు. ఏ క్యూ లైన్ లో ఎక్కువ రద్దీగా ఉంది అన్నది తెలుసుకొని క్షణాల్లోనే ఒక పరిష్కార మార్గాన్ని సూచిస్తున్నారు. 



మే 22న అత్యధిక మందికి దర్శన భాగ్యం 

మే 22 శుక్రవారం .సాధారణంగా శుక్రవారం రోజున అభిషేక సేవ ఉంటుంది. ఈ కారణంగా దర్శన సమయాన్ని కుదిస్తారు. తిరుపతి దేవస్థానం వారు తీసుకొచ్చిన కొత్త నిబంధన కారణంగా అభిషేక సేవ సమయంలోను భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కారణంగా కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న సుమారు 5800 మందికి అదనంగా దర్శన భాగ్యం కలిగింది. 

ఆ ఒక్క రోజే స్వామివారిని 94,758 మంది దర్శించుకున్నారు. 


మే నెలలో నాలుగో సారీ 


వేసవి నేపథ్యంలో ఒక మే నెలలోనే స్వామివారిని రోజుకు 90,000 మంది చొప్పున నాలుగు రోజులు పాటు భక్తులు దర్శించుకున్నారు. ఇది భక్తులకు దర్శన భాగ్యాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనుసరిస్తున్న నూతన విధానాలు ఏ విధంగా ఫలితాలు ఇచ్చాయి అన్నది సూచిస్తుంది.భవిష్యత్తులోనూ ఇంకా మెరుగైన పద్ధతులు పాటించి భక్తులకు సత్వరమే, సులువుగా, సౌకర్యవంతంగా ఆ వెంకటేశ్వర స్వామి దర్శనభాగం కల్పించాలని కోరుతున్నాం. 


ఇలాంటి మంచి సమాచారం కోసం మా తెలుగు న్యూస్ రూమ్ పేజీని

 ఫాలో అవ్వండి.

Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్