తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు

Image
 FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది. విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.  1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.  తొలుత ఉన్న...

🌊 యమునా పుష్కరాలకు ఆహ్వానం – పుణ్యస్నానం చేద్దాం!




 


      పుష్కర స్నానం ప్రాముఖ్యత


భారతదేశంలోని అతి ప్రముఖమైన నదుల్లో యమునా నది ఒకటి. 12 సంవత్సరాలకు ఒకసారి ఈ నదికి పుష్కరాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం జూన్ 2 నుంచి 13 వరకు పుష్కరాలు జరగనున్నాయి.


నదీ జన్మస్థలం 


ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వత శ్రేణుల్లో ఈ యమునోత్రి నది జన్మించింది. యమునా దేవిని సూర్యదేవుని కుమార్తెగా ,యమధర్మరాజు సోదరిగా భావిస్తారు. యమునా దేవిని పూజిస్తే మృత్యుభయం తొలగిపోతుంది, పాపాలు నశిస్తాయి. పితృ దోషాలు తగ్గుతాయని భక్తుల నమ్మకం. 


పుష్కరాల చరిత్ర 


పూర్వం పుష్కరుడు అనే దేవతకు బ్రహ్మదేవుడు ఒక వరం ఇస్తాడు.గురుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశికి సంబంధించిన నదిలో పుష్కరుడు ప్రవేశించి పవిత్రం చేస్తాడని ఆ వరం యొక్క ఉద్దేశం. 


1. పుష్కరాల సమయంలో దేవతలు నదీ స్నానం చేస్తారని విశ్వాసం. 

2. త్రిమూర్తుల ఆశీస్సులు మెండుగా లభిస్తాయి అన్నది నమ్మకం. 



పుష్కర సమయంలో చేసే ప్రధాన ఆచారాలు 


  • 1. నదీ స్నానం ఆ సమయంలో నదిలో స్నానం చేయటం వల్ల పాపాలు తొలగుతాయి. 
  • 2. ఆరోగ్యము, ఆయుష్షు ఐశ్వర్యం పెరుగుతుందని విశ్వాసం.


జపించాల్సిన మంత్రం 


యమునే హరమే పాపం 



పితృ తర్పణాలు 

పుష్కర సమయంలో చిత్ర దేవతలకు తర్పణాలు వదులుతారు.

ఇలా చేయడం వల్ల వారు శాంతించి పితృ దోషాలు తొలగిపోతాయి. కుటుంబ సమస్యలు తీరి  వంశాభివృద్ధి కలుగుతుందని విశ్వసిస్తారు. 


దానాలు 

పుష్కర సమయంలో చేసే దానాలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది.

చేయాల్సిన ముఖ్యమైన దానాలు 


1. అన్నదానం 
2. వస్త్ర దానం 
3. విద్యా దానం 
4. గోదానం 
5. సువర్ణ దానం 
6. బ్రాహ్మణ సత్కారం 


యమునా పుష్కరాలు జరిగే ముఖ్య ప్రదేశాలు 




1. మధుర  .. శ్రీకృష్ణ జన్మస్థలం. ఇక్కడ స్నానాలుకనువుగా  వాటికలు ఉంటాయి 

2. బృందావనం .. శ్రీకృష్ణ రాసలీలలకు ఎంతో ప్రసిద్ధి చెందింది 

3. ప్రయాగ్రాజ్ .. త్రివేణి సంగమం గంగా, యమునా, సరస్వతి నదులు సంఘం. 

4. ఢిల్లీ .. యమునా నది ఒడ్డున 

5. యమునోత్రి .. చార్ ధాం యాత్రలో మొట్టమొదటి పుణ్యక్షేత్రం.


పుష్కరాల ముఖ్య తేదీలు 



ప్రారంభం. జూన్ 2 2026


పవిత్రమైన తొలి 12 రోజులు. 


జూన్ రెండు నుంచి జూన్ 13 వరకు 


అంత్య పుష్కరాల ముగింపు 

జూన్ 13.



స్నానానికి ఉత్తమ సమయం 


ఉదయం 4:30 నుంచి 7 వరకు 


ఇలాంటి మంచి సమాచారం కోసం మా తెలుగు న్యూస్ పేజీని ఫాలో అవ్వండి.







Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

నాగబంధం సినిమా స్టోరీ (2026) | పూర్తి కథ, నటీనటులు, దర్శకుడు, నిర్మాతలు | Nagabandham Telugu Movie Story