తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు

Image
 FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది. విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.  1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.  తొలుత ఉన్న...

కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి మానసా దేవి

 


భక్తుల కొంగు బంగారం

మనసులో అనుకున్న కోరికలను సత్వరమే నెరవేర్చే మాత మానసా దేవి. అందుకే ఈ ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆలయం ఎక్కడ ఉంది ,చరిత్ర తదితర వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం ఇదిగో ఆ విశేషాలు. 


ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన హరిద్వార్ పట్నంలో ఈ ఆలయం ఉంది. ప్రముఖ శక్తి పీఠాలలో ఒకటిగా పేరు పొందింది. గంగానది తీరంలో ఉన్న ఈ ఆలయం కొండపై నుంచి హరిద్వార్ పట్టణ మొత్తాన్ని వీక్షించవచ్చు. శివాలిక్ పర్వతశ్రేణిలోని బిల్వ పర్వతంపై ఈ దేవాలయం ఉంది. 


కోరికలు తీర్చే దేవత

మానస అంటే మనసు. అమ్మవారి ఎదుట నిలబడి మనసులో అనుకున్న కోరికలను కోరితే అవి సత్వరమే నెరవేర్చే కల్పవల్లి. అందుకే ఆమెని కోరికలు తీర్చే దేవతగా కూడా ఇక్కడ భక్తులు పిలుస్తారు. 


పురాణ చరిత్ర 


మానసా దేవి పరమశివుడి మనసు నుంచి ఉద్భవించిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈమెను నాగదేవతల సోదరిగా భావిస్తారు. ఈ తల్లిని పూజిస్తే వివాహం ,సంతానం ,ఆరోగ్యం అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. క్రీస్తు శకం 1811 సమయంలో మహారాజా గోపాల్ సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్రకారులు చెప్పుతుంటారు. 



హరిద్వార్ పట్టణంలో ప్రముఖ శక్తి పీఠాలు 

1. మానసా దేవి ఆలయం 

2. చండీ దేవి ఆలయం 

3. మాయా దేవి టెంపుల్ 


పవిత్ర వృక్షం 

భక్తులు తమ కోరికలు నెరవేరాలని కోరుతూ ఆలయంలో ఉన్న పవిత్ర వృక్షానికి దారం లేదా రిబ్బన్ కడతారు. తమ కోరికలు నెరవేరిన తర్వాత వచ్చి దాన్ని విప్పుతారు. ఇవి ఈ ఆలయంలో ఉన్న విశేష సంప్రదాయం. 


దసరా వేడుకలు 

దసరా నవరాత్రుల సమయంలో లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తారు. ఆ సమయంలో విద్యుత్ దీపాలంకరణ ,ప్రత్యేక పూజలతో ఆలయం భక్తజన సందర్భంగా మారుతుంది. 



ప్రత్యేక ఆకర్షణ - రోప్ వే 

సాధారణంగా భక్తులు మానసా దేవి ,చండీ దేవి ఆలయాలను దర్శించుకునేందుకు మెట్ల ద్వారా వెళ్ళవచ్చు . ఇటీవల రోప్ వే సదుపాయాన్ని కల్పించారు . దీని ద్వారా హరిద్వార్ పట్నాన్ని, గంగానది తీరాన్ని అద్భుతంగా వీక్షించవచ్చు



దర్శన సమయాలు 

ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు 



సమీప రైల్వే స్టేషన్ 

తెలుగు రాష్ట్రాల నుంచి విజయవాడ ,హైదరాబాదు నుంచి ఢిల్లీ వెళ్లి ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్ళవచ్చు. 


ఎయిర్ పోర్ట్ 

జాలి గ్రాండ్ ఎయిర్పోర్ట్ డెహ్రాడూన్. ఇక్కడి నుంచి ఆలయం సుమారు 20 నుంచి 30 కి.మీ దూరం ఉంటుంది వాహన సదుపాయాలు ఉంటాయి. 


భక్తులు మానసా దేవిని మనసా, వాచా ,కర్మణా పూజిస్తే వారి కోరికలు నెరవేరుతాయి అని నమ్మకం. అందుకే ఏటా లక్షల సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తున్నారు.


ఇలాంటి మరింత సమాచారం కోసం మా 

తెలుగు న్యూస్ రూమ్ పేజీని ఫాలో అవ్వండి.








Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

నాగబంధం సినిమా స్టోరీ (2026) | పూర్తి కథ, నటీనటులు, దర్శకుడు, నిర్మాతలు | Nagabandham Telugu Movie Story