తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు

Image
 FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది. విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.  1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.  తొలుత ఉన్న...

పెద్ది సినిమాకు కష్టాలు తీరేనా …

 


పెద్ది సినిమాకు కష్టాలు తీరేనా …

చలనచిత్ర వాణిజ్యమండలిలో శుక్రవారం 

నిర్మాతలు ,ఎగ్జిబిటర్ల సమావేశం 

 సింగిల్ స్క్రీన్ ధియేటర్ యాజమాన్యాలకు ,నిర్మాతలకు మధ్య నెలకొన్న వివాదం పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి . శుక్రవారం చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడు దగ్గుబాటి సురేష్ బాబు నేతృత్వంలో రెండు వర్గాలు చర్చలకు అంగీకరించారు. తమకు కూడా మల్టీప్లెక్స్ మాదిరిగా షేరింగ్ ఇవ్వాలని సింగిల్ స్క్రీన్ థియేటర్లో యాజమాన్యం వారు నిర్మాతలపై ఒత్తిడి చేస్తున్నారు. వారి కోరికలను నిర్మాతలు అంగీకరించడం లేదు. 


సౌకర్యాలు కల్పిస్తేనే ప్రేక్షకుల రాక 

దీనిపై నిర్మాతలు కొన్ని అభ్యంతరాలు లేవలెత్తుతున్నారు సింగిల్ స్క్రీన్ యాజమాన్యాల వారు తమ థియేటర్లో మంచి సౌండింగ్ సిస్టం, సీటింగ్ మోడిఫికేషన్, లైటింగ్ ,పార్కింగ్, సేఫ్టీ తదితర అంశాలను మెరుగుపరుచుకుంటే ప్రేక్షకులు వస్తారని అవన్నీ చేయకుండా నిర్మాతల మీద పడితే తాము ఏమీ చేయలేము అని వాదిస్తున్నారు. ఇదే సమయంలో యాజమాన్యం వారు మాత్రం సినిమా రిలీజ్ విషయంలో మల్టీప్లెక్స్ లకు ఇచ్చినంత ప్రయారిటీ తమకు ఇవ్వడం లేదని తమకు కూడా తగిన ప్రాముఖ్యతను ఇస్తే ఆ వచ్చే ఆదాయంతో థియేటర్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్నారు.


ప్రేక్షకుల మాత్రం.. రెండు వర్గాలు సమస్యలను పరిష్కరించుకొని పెద్ది సినిమాను సకాలంలో రిలీజ్ చేసి తమకు ఆనందం కలిగించాలని కోరుకుంటున్నారు.


ఇలాంటి మరిన్ని అప్డేట్లు కోసం Telugu NewsRoom 🗞️ నీ follow చెయ్యండి.

Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

నాగబంధం సినిమా స్టోరీ (2026) | పూర్తి కథ, నటీనటులు, దర్శకుడు, నిర్మాతలు | Nagabandham Telugu Movie Story