తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు

Image
 FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది. విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.  1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.  తొలుత ఉన్న...

హైదరాబాద్ క్రికెట్ అభిమానుల జేబులకు చిల్లు

 


ఆర్సీబీ మ్యాచ్ కు భారీగా పెరిగిన టికెట్ల ధరలు 

ఈనెల 22న హైదరాబాదులో సన్ రైజర్స్ హైదరాబాద్, ఆర్సిబి బెంగళూరు మధ్య జరిగే ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రేక్షకులు పోటీపడ్డారు .దీనికి నిదర్శనం నిన్న ఆన్లైన్లో జరిగిన టికెట్ల అమ్మకాలే. హైదరాబాదు ఉప్పల్ స్టేడియం సామర్థ్యం 39,000. కానీ ఆన్లైన్ లో టికెట్లు కొనేందుకు సుమారు నాలుగు లక్షల మంది పోటీపడ్డారు. అభిమానుల ఉత్సాహాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం బాగానే సొమ్ము చేసుకుంది .టిక్కెట్ల ధరలను విపరీతంగా పెంచేశారు .అయినప్పటికీ అమ్మకాలు ప్రారంభమైన కొద్దిసేపటికి సోల్డ్ అవుట్ అని యాప్ లో కనిపించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. అదే సమయంలో సన్రైజర్స్ యాజమాన్యం పై అభిమానులు గుర్రుగా ఉన్నారు. క్రికెట్ పై తమకున్న అభిమానాన్ని ఈ విధంగా సొమ్ము చేసుకోవడం సరికాదని, ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే యాజమాన్యం మాత్రం ఇవేవీ పట్టించుకోవటం లేదు .కాసుల దాహం తీర్చుకునేలా వాళ్ళ చర్యలు ఉన్నాయి. 


టికెట్ల ధరలు 


కనిష్ట ధర 1950 

గరిష్ట ధర 45000 


సౌత్ సెకండ్ ఫ్లోర్ కార్పొరేట్ బాక్స్ ధర 45,000.

వెస్ట్ సెకండ్ ఫ్లోర్ కార్పొరేట్ బాక్స్ ధర 30,000.


ఆరెంజ్ ఆర్మీ ఈస్ట్ వెస్ట్ లాంజ్ ధరలు 20,000.


ఈస్ట్, వెస్ట్ స్టాండ్ ఫస్ట్ ఫ్లోర్ రేట్ 4500

గ్రౌండ్ ఫ్లోర్. 6000


మరింత సమాచారం కోసం తెలుగు న్యూస్ రో ఛానల్ ని ఫాలో చేయండి.


Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

నాగబంధం సినిమా స్టోరీ (2026) | పూర్తి కథ, నటీనటులు, దర్శకుడు, నిర్మాతలు | Nagabandham Telugu Movie Story