తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

వాయనాట్టు కులవన్ దేవస్థానం – కాసరగోడ్, కేరళ | చరిత్ర, విశేషాలు, తేయ్యం, దర్శన సమాచారం

Image
  సాధారణంగా ఏదైనా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు ,అభిషేకాలు, హోమాలు, జపాలు, కళ్యాణోత్సవాలు ,బ్రహ్మోత్సవాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తే పలు సమస్యల నుంచి బయట పడవచ్చు అని మనం వింటుంటాం కానీ భారతదేశంలోని ఈ ఆలయం మాత్రం ఒక విశిష్టమైన మహా శక్తిని కలిగి ఉంది  ఈ ఆలయ ప్రసాదం మన ఇంట్లో ఉంటే కోర్టు కేసుల నుంచి సులువుగా బయటపడవచ్చు అంతేకాక మన శరీరంలో కడుపుకు సంబంధించిన గ్యాస్ ట్రబుల్, అల్సర్, పేగు పుండులు తదితర సమస్యల నుంచి కూడా సులువుగా నయమవుతాయి.  పై మాటలు చదివి ఇదేదో వింతగా ఉంది అనుకుంటున్నారా కానీ 100% అక్షరాలా నిజం. సుప్రీంకోర్టుకు చెందిన పలువురు కక్షీదారులు ప్రతిరోజు ఢిల్లీ నుంచి ఈ ఆలయానికి వచ్చి ఆలయంలో పూజారి విక్రయించే ప్రసాదాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తారు. ఈ ప్రసాదాన్ని దేవుడి గదిలో ఉంచి ప్రతిరోజు పూజ చేయడం వల్ల మనకు సకల శుభాలు కలుగుతాయి .ఇప్పుడు ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి.  కేరళ రాష్ట్రంలోని కాసరగుడు జిల్లాలో పలు వాయునట్టు కులవన్ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పలక్ శ్రీ వాయునట్టు కులం దేవస్థానం. ఈ దేవతను గ్రామ రక్షకుడిగా పలువురు ఆరాధిస్తారు...

జూన్ నుంచి సర్ …ఓటర్ల జాబితా సవరణ

 



జూన్ నుంచి సర్ …


     దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు ,మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ.


     ఆంధ్రప్రదేశ్లో …

     జూన్ 15 నుంచి జూలై 14 వరకు బిఎల్ఓ లు ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితాను పరిశీలన చేస్తారు.


    తెలంగాణలో..

జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరుగుతుంది.


ఓటర్లు, రాజకీయ నాయకులు, అధికారుల భాగస్వామ్యంతో జరిగే కార్యక్రమం. అన్ని రాజకీయ పార్టీలు ప్రతి బూత్ కు పోలింగ్ ఏజెంట్లను నియమించాలి. 


కార్యక్రమం సాగుతుంది ఇలా..

చనిపోయిన వారి, డూప్లికేట్ ,శాశ్వతంగా తరలిపోయిన వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించి అర్హులు మాత్రమే ఉండేలా చూస్తారు. బిఎల్ఓ లో ఇంటింటికి వెళ్లి పరిశీలిస్తారు ఓటర్లు భర్తీ చేసిన ఎన్యూ రేషన్ పారాల్లో పాత డేటా తో పోల్చి చూస్తారు. 


గతంలో..

1951 నుంచి 2004 మధ్యకాలంలో 8 సార్లు ఇలాంటి సర్వే చేశారు. చివరిగా 2001 నుంచి 2004 మధ్య జరిగింది. 


ఇంటికి తాళం వేసి వెళితే..

బి ఎల్ వోలు ఇంటికి వెళ్ళినప్పుడు తాళం ఉంటే కనీసం మూడుసార్లు ఆ ఇంటినీ సందర్శించాల్సి ఉంటుంది. 



ఆ రెండు పత్రాలు..

ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2002లో సర్వే జరిగింది తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి చేపట్టనున్నారు ఇప్పటికే అధికారులు 2002 నాటి.. తాజా జాబితాలను బీఓలకు అందించారు .వారు ఇంటింటికి వెళ్లి 2 పత్రాలను ఇస్తారు. పూర్తి చేసిన ఒక ప్రతిని తీసుకొని రెండోది ఓటరు రసీదుగా అందిస్తారు. ఓటర్లు ఆ పత్రాలను ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులను బిఎల్ఓ ఇంటికి వచ్చినప్పుడు ధృవీకరణ చేస్తారు. 


అప్పీల్ కు అవకాశం 


జూలై 31న ప్రశ్నించే ముసాయిదా జాబితాలో పేరు లేకపోయినా, ఓటర్ నమోదులో ఎన్నికల నమోదు అధికారి తీసుకున్న నిర్ణయం పై సంతృప్తి చెందకపోయినా జిల్లా మేజిస్ట్రేట్ కి అప్లై చేసుకోవచ్చు. మొదటి అప్పీల్ నిర్ణయం పై అభ్యంతరం ఉంటే రాష్ట్ర సీఈఓ కి రెండో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. 


ఫిర్యాదులు అభ్యంతరాల దాఖలు 

జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు 


దరఖాస్తు పరిష్కారానికి నోటీసుల జారీ  

జులై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు 


తుది ఓటర్ జాబితా ప్రచురణ 

అక్టోబర్ 1




Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్