తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు

Image
 FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది. విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.  1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.  తొలుత ఉన్న...

అంతర్జాతీయ విమాన సర్వీసులు తగ్గించిన ఎయిర్ ఇండియా



ఎయిర్ ఇండియాపై ఇరాన్ యుద్ధ ప్రభావం

ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా తన అంతర్జాతీయ సర్వీస్ లను తగ్గించడంతోపాటు కొన్ని ప్రాంతాలకు ఆగస్టు 29 వరకు సేవలు నిలిపివేసింది.


గగనతల ఆంక్షలు..

ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ఎయిర్ ఫ్యూయల్ ధరలు పెరగడంతో పాటు గగనతల ఆంక్షలు తమ సేవలపై ప్రభావం చూపాయని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ సర్వీసులు తగ్గించడానికి కారణం ఏంటంటే పలు దేశాల్లో ఇంధన ధరలు 100 నుంచి 500 శాతానికి పెంచారు. 


ఆ భారం భరించలేక

ఒక విమానం ఇండియా నుంచి చికాగో వెళ్ళింది అనుకున్నాం. ఇండియాలో ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేసుకొని వెళ్తారు .అనంతరం చికాగోలో కూడా మళ్లీ ట్యాంక్ ఫుల్ చేయాలి. ఇండియాలో ధరలు సామాన్యంగానే ఉన్నా అమెరికాలో మాత్రం ధరలు బాగా పెరిగాయి. ఇదే సమయంలో చార్జీలు మాత్రం చాలా తక్కువ శాతం పెంచారు .ఇది ఎయిర్ లైన్స్ కు భారంగా మారింది. గత ఏడాది రూ.22 వేల కోట్లు నష్టాలు చూసిన ఎయిర్ ఇండియాకు ఇది మరింత భారంగా మారింది. ఈ నేపథ్యంలో తమ సర్వీసుల ప్రణాళికను తగ్గించుకున్నారు. 


హామీతో ఊరట

ఈ సంక్షోభంలో కూడా ఐదు ఖండాలకు ప్రతినెల 1200 సర్వీసులు నడుపుతామని హామీ ఇచ్చారు ఇది ప్రయాణికులకు ఊరట కలిగించే అంశం.ఇప్పటికే మే నెలలో 90 కి పైగా సర్వీసులను ఎయిర్ ఇండియా నిలిపివేసింది. ఈ అంతర్జాతీయ సర్వీసులు దానికి అదనం.


నిలిపివేసిన … తగ్గించిన సర్వీసులు..

ఢిల్లీ - చికాగో , ఢిల్లీ- న్యూయార్క్ ,ముంబై -న్యూయార్క్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు .

ఢిల్లీ -సాన్ ఫ్రాన్సిస్కో వారానికి 10 నుంచి 7 , ఢిల్లీ -టొరంటో వారానికి పది నుంచి ఐదుకు,ఢిల్లీ -వాంకవర్ వారానికి ఏడ్నుంచి ఐదుకు తగ్గించారు.

Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

నాగబంధం సినిమా స్టోరీ (2026) | పూర్తి కథ, నటీనటులు, దర్శకుడు, నిర్మాతలు | Nagabandham Telugu Movie Story