తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

మే 26, 2026 | 12 రాశుల వారి రాశి ఫలాలు

  😱 మే 26న ఈ 3 రాశుల అదృష్టం ఒక్కసారిగా మారబోతోంది! ⚠️ మీ రాశి లిస్టులో ఉందో లేదో చూడండి! మే 26, 2026 | 12 రాశుల వారి రాశి ఫలాలు 🦂 వృశ్చికం – ఈ రోజు పనుల్లో జాగ్రత్త అవసరం. చిన్న ఆలస్యం వచ్చినా చివరికి అనుకూల ఫలితం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. 🐟 మీనం – ప్రశాంతంగా రోజు గడుస్తుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. డబ్బు విషయంలో సంతృప్తి ఉంటుంది. 🐂 వృషభం – కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఖర్చులను నియంత్రిస్తే లాభం ఉంటుంది. ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. 🏺 కుంభం – కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. ఉద్యోగంలో మంచి సహకారం లభిస్తుంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. 👩‍🌾 కన్య – పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ అవసరం. సాయంత్రానికి ఉపశమనం ఉంటుంది. 🏹 ధనుస్సు – అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మంచి రోజు. ప్రయాణ యోగం ఉంది. 🦀 కర్కాటకం – ఆర్థికంగా ప్లాన్ చేసుకుంటే మంచిది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. 🐏 మేషం – ఉద్యోగంలో చురుకుదనం కనిపిస్తుంది. డబ్బు విషయంలో మంచి ఫలితం ఉంటుంది. చిన్న శుభవార్త వినే అవకాశం ఉం...

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

 మూడు పూటలా -మూడు రూపాల్లో 
భక్తులకు దర్శనమిచ్చే అమ్మవారు 🙏🙏

Temple view



సాధారణంగా ఏ ఆలయంలోనైనా దేవతా మూర్తి ఒకే రూపంలో కనిపిస్తారు. 24 గంటలు…365 రోజులు ఒకే ఆకృతిలో భక్తులకు దర్శనమిస్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం అమ్మవారు మూడు పూటలా..మూడు రూపాల్లో భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఆ ఆలయం ఎక్కడ ఉంది.. చరిత్ర ఏమిటి.. తదితర వివరాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా..


ఈ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. సంవత్సరానికి ఆరు నెలలు మాత్రం భక్తులతో రద్దీగా ఉంటుంది. పవిత్ర శక్తి పీఠాలలో ఒకటిగా పేరు పొందింది. అలకనంద నది తీరంలో ఒక చిన్న రాతి దీపం పై ఈ గుడి ఉంది. స్థానిక ప్రజలు అమ్మవారిని రక్షణ దేవత లేదా రక్షక మాతగా పిలుస్తారు. చార్ధామ్ యాత్ర లోని నాలుగు ప్రముఖ పుణ్యక్షేత్రాలను కాపాడే ఆదిశక్తిగా ఈ తల్లి పేరుపొందింది. ఆమె దారీ దేవి. ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని కాపాడే దేవతగా కూడా ఈ తల్లిని పిలుస్తారు.



స్థల పురాణం 

పూర్వకాలంలో అలకానందా నదికి భారీ వరదలు వచ్చాయి .ఆ సమయంలో ఒక విగ్రహం కొట్టుకుంటూ వచ్చి శ్రీనగర్ సమీప ప్రాంతంలోని ప్రజలకు కనిపించింది. స్థానికులు ఆ విగ్రహం వద్దకు వెళ్లగా ఆకాశవాణి రూపంలో ఒక సందేశం వారికి వినిపించింది ..నన్ను ఇక్కడ ప్రతిష్టించండి నేను మీ ప్రాంతాన్ని కాపాడుతాను అన్న మాటలు విన్న వెంటనే గ్రామస్తులు నది మధ్యలో ఒక రాయిపై ఆలయాన్ని నిర్మించారు .అప్పటి నుంచి ఆ అమ్మవారు నిత్య పూజలు అందుకుంటున్నారు.



ఇలా చేరుకోండి 

చార్ధామ్ యాత్ర చేసే ప్రతి భక్తుడు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు .అమ్మవారి ఆశీస్సులు ఉంటే ప్రయాణం సాఫీగా క్షేమంగా సాగుతుందని నమ్మకం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని శ్రీనగర్ పట్టణానికి సమీపంలో ఈ దారి దేవి ఆలయం ఉంది. శ్రీనగర్ నుంచి కేదార్నాథ్ వెళ్లే మార్గంలో కనిపిస్తుంది. నది మధ్యలో ఈ ఆలయం ఉండటం వల్ల అక్కడికి వెళ్లేందుకు ఒక వంతెనను నిర్మించారు. జీపులు, ద్విచక్ర వాహనాలు మాత్రమే ఆలయం వరకు వెళ్లగలవు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన రిషికేశ్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఈ దారి దేవి ఆలయం ఉంటుంది. కొందరు భక్తులు మాత్రం దీన్ని శక్తి పీఠంగా కొలుస్తారు 108 శక్తి పీఠాలలో ఇది కూడా ఒకటని స్థానికుల విశ్వాసం 


అమ్మవారి ఉగ్రరూపం 

2013లో జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణం కోసం అమ్మవారి విగ్రహాన్ని స్థాన చలనం చేశారు ఆ సమయంలోనే ఉత్తరాఖండ్లో భారీ వరదలు సంభవించాయి .కేదార్నాథ్ ఆలయం మునిగిన ఘటన కూడా అప్పుడే జరిగింది .ఒక భారీ శిల కారణంగా కేదార్నాథ్ ఆలయం చెక్కుచెదరకుండా ఉంది . వరదలకు కారణం అమ్మవారి విగ్రహాన్ని పక్కకు జరపటమేనని స్థానికులు విశ్వసిస్తారు. ఆ వరదలు అనంతరం స్థానిక కాంట్రాక్టర్ అమ్మవారి ఆలయం జోలికి పోకుండా దూరంగా ఉన్నాడు.




అద్భుత దర్శనం 

దారీ దేవి అమ్మవారి విగ్రహం రోజులో మూడు రూపాల్లో దర్శనమిస్తుంది. 

ఉదయం వేళ చిన్న బాలిక రూపంలో .. 

మధ్యాహ్నం యువతిగా.. 

రాత్రివేళ వృద్ధ మహిళ రూపంలో 


అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు .ఇది అమ్మవారి దివ్య శక్తికి నిదర్శనం.ప్రపంచంలో ఏ ఆలయంలో కూడా ఇట్లాంటి దర్శన భాగ్యం భక్తులకు లభించదు. ఇదే ఈ దారి దేవి ఆలయ ప్రత్యేకత. జీవితంలో ఒక్కసారి అయినా ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని సందర్శించి అమ్మవారి కృపకు పాత్రులు కండి.


మా అనుభవం 

మేము 2023 వ సంవత్సరం జూన్ నెలలో ఈ ఆలయాన్ని సందర్శించాము ఉదయం వేళ ఆరు గంటలకు ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నాము .ఆ సమయంలో అమ్మవారు దేదీప్యమానంగా ఒక బాలిక రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అయితే మేము ఫోటో తీయడానికి ప్రయత్నించాం కానీ అక్కడ ఉన్న పూజారులు ,సిబ్బంది ఒప్పుకోలేదు. చివరకు బతిమాలితే దూరం నుంచి ఒక ఫోటో మాత్రం తీయగలిగాము. అది మీకోసం మేము ఈ పోస్టులో అప్లోడ్ చేస్తున్నాము చూసి తరించండి. 


ఆలయ వాతావరణం 

చుట్టూ అలకానందా నది జలాలు… మధ్యలో రాయిపై అమ్మవారి గుడి.. చల్లని వాతావరణం లో వేకువ జామన సూర్యకిరణాలు పడుతూ ఉంటే.. ఆ సమయంలో అమ్మవారి సన్నిధిలో గడపటం ఎంతో పూర్వజన్మ సుకృతం. మీరు కూడా తప్పనిసరిగా ఈ ఆలయాన్ని ఒకసారి దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందండి. 







అనుకూల సమయం 


ఏప్రిల్ నుంచి జూన్ ..

సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ..


జులై ,ఆగస్టు నెలలో భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యాత్రికులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి .వీలైనంత వరకు ఆ సమయంలో యాత్రకు వెళ్ళకపోవడమే మంచిది. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడి రోజుల తరబడి ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. అక్కడ కనక చిక్కుకుంటే ఆకలి దప్పులతో అలమాటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి .


యాత్రలో తప్పక తీసుకు వెళ్లాల్సిన వస్తువులు 


ధర్మల్ ,

స్వెటర్ ,

రైన్ కోట్ ,

 ట్రెక్కింగ్ షూస్,

మెడిసిన్స్,

పవర్ బ్యాంక్,

Mufler, మంకీ క్యాప్,

గ్లోవ్స్,

గొడుగు. 

బ్యాక్ ప్యాక్. 




చార్ ధామ్ పుణ్యక్షేత్రాలు ఇవే..


యమునోత్రి 

గంగోత్రి 

కేదార్నాథ్ 

బద్రీనాథ్.


ఢిల్లీ నుంచి రోడ్డు మార్గంలో హరిద్వార్ ,రుషికేశ్ మీదగా ఈ చార్ధామ్ యాత్ర చేయవచ్చు. విమానంలో వెళ్లాలనుకున్న ప్రయాణికులు తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి డెహ్రాడూన్ కు ప్రతిరోజు ఫ్లైట్ సర్వీస్ ఉంది. ఈ dehradun హరిద్వార్ ఋషికేశ్ కి కేవలం 20 కిలోమీటర్ల లోపు దూరం మాత్రమే ఉంటుంది.


యాత్రకు సంబంధించి మీకు ఏమైనా సలహాలు కావాలంటే మెసేజ్ చేయండి మీకు పూర్తి క్లారిఫై చేస్తాం. 


జైశ్రీరామ్… జై బోలో నాథ్


ఇలాంటి మరిన్ని ఆలయ విశేషాల కోసం తెలుగు న్యూస్ రూమును ఫాలో అవ్వండి. 

ఇలాంటి మరిన్ని ఆలయ విశేషాల కోసం TeluguNewsroom ను ఫాలో అవ్వండి 🙏





Comments

Post a Comment

Popular posts from this blog

వెంకన్న భక్తులకు అద్భుత అవకాశం