తొలి ఏకాదశి 2026 ఎప్పుడు? విశిష్టత, పూజా విధానం, నైవేద్యాలు, ఉపవాస నియమాలు – పూర్తి వివరాలు
సాధారణంగా ఏదైనా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు ,అభిషేకాలు, హోమాలు, జపాలు, కళ్యాణోత్సవాలు ,బ్రహ్మోత్సవాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తే పలు సమస్యల నుంచి బయట పడవచ్చు అని మనం వింటుంటాం కానీ భారతదేశంలోని ఈ ఆలయం మాత్రం ఒక విశిష్టమైన మహా శక్తిని కలిగి ఉంది
ఈ ఆలయ ప్రసాదం మన ఇంట్లో ఉంటే కోర్టు కేసుల నుంచి సులువుగా బయటపడవచ్చు అంతేకాక మన శరీరంలో కడుపుకు సంబంధించిన గ్యాస్ ట్రబుల్, అల్సర్, పేగు పుండులు తదితర సమస్యల నుంచి కూడా సులువుగా నయమవుతాయి.
పై మాటలు చదివి ఇదేదో వింతగా ఉంది అనుకుంటున్నారా కానీ 100% అక్షరాలా నిజం. సుప్రీంకోర్టుకు చెందిన పలువురు కక్షీదారులు ప్రతిరోజు ఢిల్లీ నుంచి ఈ ఆలయానికి వచ్చి ఆలయంలో పూజారి విక్రయించే ప్రసాదాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తారు. ఈ ప్రసాదాన్ని దేవుడి గదిలో ఉంచి ప్రతిరోజు పూజ చేయడం వల్ల మనకు సకల శుభాలు కలుగుతాయి .ఇప్పుడు ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి.
కేరళ రాష్ట్రంలోని కాసరగుడు జిల్లాలో పలు వాయునట్టు కులవన్ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పలక్ శ్రీ వాయునట్టు కులం దేవస్థానం. ఈ దేవతను గ్రామ రక్షకుడిగా పలువురు ఆరాధిస్తారు.
పురాణ గాథ
ఈ ఆలయానికి సుమారు 1500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ వాయునట్టు కులవన్ ధర్మాన్ని రక్షించే దైవంగా ప్రజలు విశ్వసిస్తారు. ఇతను పరమశివుని అనుగ్రహంతో ఉద్భవించిన దేవతగా స్థానికులు పూజలు చేస్తారు.
ప్రసాదం… పరమార్థం
ఈ ఆలయంలో విక్రయించే ఆడ అంటే అరిటాకులో తయారుచేసిన ప్రసాదం ఎంతో విశిష్టమైనది. బియ్యపిండి, బెల్లం యాలకులను మిశ్రమంగా కలిపి ఒక అరిటాకులో ఉంచి ఆవిరి మీద ఉడికిస్తారు. అయితే దేవస్థానం బయట దుకాణాల్లో కూడా ఈ ఆడ ప్రసాదాన్ని విక్రయిస్తారు. అక్కడ ఎక్కడా కూడా భక్తులు కొనకూడదు ఆలయ పూజారి తయారుచేసిన ప్రసాదంలో పవర్ ఫుల్ ఎనర్జీ ఉంటుంది.
శక్తి కేంద్రం ..
సాధారణంగా ఆలయాలను ఆధ్యాత్మికతతో పాటు శక్తి కేంద్రాలుగా భావిస్తారు.. దీనికి కారణం వాటి నిర్మాణ శైలే.గర్భగుడిలో స్వామివారిని దర్శించుకోవడం, ధ్వజస్తంభం స్పర్శ ,ఆలయ ప్ చుట్టూ ప్రదక్షిణలు,దేవతలకు చేసే జలాభిషేకాలు, పూజా కార్యక్రమాల ద్వారా భక్తులకు శక్తి ప్ ప్రసారమై స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. ఇది ఎన్నో ప్రముఖ ఆలయాల్లో నిరూపితమైనది కానీ వాయు నట్టు కులవన్ దేవస్థానంలో అత్యంత పవర్ఫుల్ శక్తి కేంద్రం ఆ దేవస్థానం యొక్క వంటగది. అక్కడ తయారు చేసే ఆడ ప్రసాదం మహిమాన్వితంగా మారి భక్తుల కొంగుబంగారంగా పేరుంది. ప్రతిరోజు ఈ ప్రసాదాన్ని కొనుగోలు చేసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు.
న్యాయవివాదాలు… అనారోగ్య సమస్యలు
ఆడ ప్రసాదాన్ని కొనుగోలు చేసిన తర్వాత ప్రతి ఒక్కరు తమ డిఇంటికి తీసుకువెళ్లి ఇంట్లోనే పూజ గదిలో ఉంచి ప్రతిరోజు ధూప దీపాలతో పూజించాలి .ఇలా పూజించడం వల్ల ఆ ప్రసాదం యొక్క శక్తి సుమారు 500 అడుగుల దూరం వరకు విస్తరిస్తుంది తద్వారా గృహంలోని నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది.కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. అంతేకాక వాయునట్టు కులవన్ ధర్మాన్ని రక్షించే దేవుడు. ఈ ప్రసాదం ద్వారా అతను భక్తుల యొక్క న్యాయపరమైన సమస్యలను సులువుగా వేగంగా పరిష్కరిస్తాడని విశ్వాసం.
ఈ ప్రసాదాన్ని తీసుకెళ్లినవారు కోర్టు కేసుల్లో గెలిచి తిరిగి వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. దీర్ఘకాలంగా నయం కానీ గ్యాస్టిక్ అల్సర్ ,పేగుపూత సమస్యలు కూడా ఈ ప్రసాదము తీసుకోవడం వల్ల నయమయ్యాయని పెద్ద సంఖ్యలో భక్తులు చెబుతుంటారు.
ఉత్సవాలు
ఇక్కడ దెయ్యాలు పేరుతో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆరోజున రంగురంగుల అలంకరణలు ,నృత్య ప్రదర్శనలు, సంప్రదాయ ఆచారాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహిస్తారు దీన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇప్పుడే కేరళ రాష్ట్రంలోని కాసర్గూడు జిల్లాలో ఉన్న వాయునట్టు కులవన్ దేవస్థానానికి వెళ్ళండి.
ఆలయానికి చేరుకునే మార్గాలు
రైల్వేస్టేషన్…కంచం గడ్ రైల్వేస్టేషన్.. ఇక్కడి నుంచి ఆలయానికి చేరుకోవడానికి బస్సులు, ఆటోలు, కార్లు ఉంటాయి. మొత్తం 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది అరగంట సమయం పడుతుంది.
సమీప విమానాశ్రయం.. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం . సుమారు 71 కిలోమీటర్ ఉంటుంది గంటన్నర సమయం పడుతుంది కారు గాని ,బస్సులో గాని.
మీకు ఇలాంటి మరింత సమాచారం కావాలంటే మా
తెలుగు న్యూస్ రూమ్
పేజీని ఫాలో అవ్వండి.
వాయనాట్టు కులవన్, Vayanattu Kulavan, Vayanattu Kulavan Temple, Kasaragod, Kerala, Theyyam, Kerala Temples, Temple History, Telugu Temple, Devotional, Hindu Temple, Bhakti, Temple Information, Kasaragod Temple, Kerala Tourism, South India Temples, దేవాలయ చరిత్ర, కేరళ దేవాలయాలు, కాసరగోడ్, తేయ్యం
Comments
Post a Comment