FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు
హైదరాబాదులోనీ ప్రముఖ ఆస్పత్రి నిమ్స్ లో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనున్నారు. ఆగస్టు 13 నుంచి చేపట్టే ఈ చికిత్సలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు, వైద్య సిబ్బంది సూచిస్తున్నారు.
సామాజిక ఆరోగ్య పథకంలో భాగంగా హైదరాబాద్ లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఈ సంవత్సరం పిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించాలని నిర్ణయించింది.
అపాయింట్మెంట్ లేకుండానే.
ఈ ఆపరేషన్ చేయించుకోవలసిన వారికి ఎటువంటి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. పిల్లలకు సంబంధించిన ఆరోగ్య పత్రాలు ,చికిత్స రిపోర్టు లు తీసుకొని వైద్యుల్ని సంప్రదించాలి. వాటిని పరిశీలించిన వైద్యులు అత్యవసర అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆపరేషన్లు చేస్తారు.
చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లల హెల్త్ రిపోర్ట్ తీసుకొని సోమవారం నుంచి శనివారం వరకు నిమ్స్ ప్రాంగణంలోని ఓల్డ్ బ్లాక్ లోని మొదటి అంతస్తులో ని సిటీ సర్జరీ కార్యాలయాన్ని సందర్శించాలి.
ఫోన్ నెంబర్..040…2348 9025 లో సంప్రదించాలి.
ఆపరేషన్ అవసరమైన చిన్నారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని గత ఐదు సంవత్సరాలుగా నిమ్స్ ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. గుండె వైద్య విభాగ అధిపతి అమరేశ్వరరావు, లండన్ కు చెందిన పీడియాట్రిక్ నిపుణులు రమణ సహకారంతో ఈ ఆపరేషన్లు నిర్వహిస్తారు.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు
తల్లిదండ్రులు ఆపరేషన్ కోసం ముందస్తు అపాయింట్మెంట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆస్పత్రికి వెళ్లే ముందు తమ పిల్లల రిపోర్ట్లు అన్ని వెంట తీసుకువెళ్లాలి.
ఇలాంటి మరింత సమాచారం కోసం మా
తెలుగు న్యూస్ రూమ్
పేజీని
ఫాలో అవ్వండి.
NIMS | Hyderabad | Telangana | Health News | Children Health | Free Treatment | Medical News | Government Hospital
NIMS Hyderabad, NIMS Free Treatment, NIMS Children Treatment, Free Heart Surgery, Children Free Treatment, NIMS Hospital, Hyderabad News, Telangana News, చిన్నారులకు ఉచిత చికిత్స, నిమ్స్ ఆసుపత్రి, నిమ్స్‌లో ఉచిత చికిత్సలు, చిన్నారుల గుండె చికిత్స, ఉచిత గుండె శస్త్రచికిత్సలు, హైదరాబాద్ వార్తలు, తెలంగాణ వార్తలు.
Comments
Post a Comment