తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు

Image
 FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది. విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.  1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.  తొలుత ఉన్న...

జూలై 3, 2026 పంచాంగం | సంకష్టహర చతుర్థి విశేషాలు | ఈరోజు తెలుగు పంచాంగం

 

జూలై 3, 2026 తెలుగు పంచాంగం, సంకష్టహర చతుర్థి, గణపతి పూజ, రాహుకాలం, శ్రవణ నక్షత్రం వివరాలతో వెబ్‌సైట్ థంబ్‌నెయిల్


ఈరోజు సంకట హర చతుర్థి. గణపతికి ఉండ్రాళ్ళు సమర్పించి గరికతో పూజ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో విజయం సాధిస్తారు కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. 


ఈ రోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, కృష్ణ పక్షంలోని తదియ తిథి. తదియ ఉదయం 9:03 గంటల వరకు కొనసాగి, అనంతరం చవితి ప్రారంభమవుతుంది.

 నక్షత్రం: 

శ్రవణం ఉదయం 10:24 గంటల వరకు, తర్వాత ధనిష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది.


వర్జ్యం: 

మధ్యాహ్నం 2:38 నుంచి 4:19 వరకు

 

దుర్ముహూర్తం: 

• ఉదయం 8:09 నుంచి 9:01 వరకు • మధ్యాహ్నం 12:30 నుంచి 1:22 వరకు


అమృతకాలం: 

అర్ధరాత్రి 12:46 నుంచి 2:27 వరకు

 

రాహుకాలం: 

ఉదయం 10:30 నుంచి 12:00 వరకు


 యమగండం: 

మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు


సూర్యుడు:

 మిథున రాశిలో సంచరిస్తున్నాడు.


 చంద్రుడు: 

మకర రాశిలో విహరిస్తున్నాడు.


సూర్యోదయం: 

ఉదయం 5:33 గంటలకు


సూర్యాస్తమయం: 

సాయంత్రం 6:35 గంటలకు


జపించాల్సిన మంత్రం.. 

ఓం గం గణపతియే నమః

ఇలాంటి మరింత సమాచారం కోసం మా

 తెలుగు న్యూస్ రూమ్ 

పేజీని ఫాలో అవ్వండి


#జూలై3పంచాంగం #తెలుగుపంచాంగం #సంకష్టహరచతుర్థి #ఈరోజుపంచాంగం #DailyPanchangam #TeluguCalendar #HinduFestival #GaneshPuja #TeluguNewsRoom #Spiritual



Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

నాగబంధం సినిమా స్టోరీ (2026) | పూర్తి కథ, నటీనటులు, దర్శకుడు, నిర్మాతలు | Nagabandham Telugu Movie Story