తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు

Image
 FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది. విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.  1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.  తొలుత ఉన్న...

ఆగస్టు 2026లో బ్యాంకు ఉద్యోగులకు సెలవులే సెలవులు.. పూర్తి హాలిడే లిస్ట్ ఇదే!

 

ఆగస్టు 2026 బ్యాంకు సెలవుల జాబితా - మూసివేసిన బ్యాంకు బ్రాంచ్ చిత్రం


ఆగస్టులో బ్యాంకు ఉద్యోగులకు 

సెలవులే సెలవులు 


మీరు ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగా .అయితే ఆగస్టు నెలలో మీరు ఒక లాంగ్ ట్రిప్ కి ప్లాన్ చేసుకోవచ్చు. అది స్వదేశంలో అయినా విదేశంలోనైనా సరే ఎందుకంటే ఆ నెలలో వచ్చే సెలవులను కనుక తెలివిగా వాడుకుంటే అటు ఉద్యోగానికి ఉద్యోగం …ఇటు సంతోషానికి సంతోషం మీకు దక్కుతుంది. 


ఖాతాదారులకు తిప్పలు

ఆగస్టు 2026 బ్యాంకు సెలవుల జాబితా



ఇదే సమయంలో వ్యాపారులు ,ఉద్యోగులు, విద్యార్థులు ,పింఛన్దారులు రైతులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఆగస్టు నెలలో వచ్చే స్వతంత్ర దినోత్సవం, పండుగలు, వారాంతపు సెలవులతో కలిపి మొత్తం 15 రోజులు పాటు బ్యాంకులు పనిచేయవు. 


డబ్బులు కావాలంటే ఆన్లైన్లో యూపీఐ యాప్ ల ద్వారా సెండ్ చేసుకోవచ్చు .రిసీవ్ చేసుకోవచ్చు కానీ స్వయంగా బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన పనులు గనుక ఉన్నాయంటే ఖాతాదారులందరూ అప్రమత్తంగా వ్యవహరించి ముందే మీ పనులను సకాలంలో పూర్తి చేసుకోండి లేకపోతే ఇబ్బందులు తప్పవు. 


ప్రాంతాలను బట్టి..

అయితే ఈ సెలవులు దేశవ్యాప్తంగా ఒకే రోజు ఒకే రాష్ట్రంలో ఒకేరోజు అమలు చేయడం లేదు. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన స్థానిక పండుగలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. ఆదివారాలు ,స్వాతంత్ర దినోత్సవం, వారాంతపు సెలవులు ఇవన్నీ దేశవ్యాప్తంగా ఒకే రోజు ఒకే విధంగా అమలు చేస్తారు మిగిలిన తేదీల్లో ఆయా రాష్ట్రాలను బట్టి మార్పులు ,చేర్పులు ఉంటాయి.


రిజర్వ్ బ్యాంక్ విడుదల.. 

బ్యాంకు సెలవులకు సంబంధించి రిజర్వు బ్యాంకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనను క్షుణ్ణంగా పరిశీలించి మీ ప్రాంతాల్లోని బ్యాంకులు ఏరోజు పని చేస్తాయి ఏ రోజు మూసి వేస్తారు తెలుసుకోవాలని ఖాతాదాలకు సూచించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన క్యాలెండర్లో ఉన్న సెలవులు ఇవే. 


ఆగస్టులో బ్యాంకుల సెలవుల 

తేదీలు ఇవే…


ఆగస్టు 4 మంగళవారం… కేర్ పూజ సందర్భంగా త్రిపురలో సెలవు. 

ఆగస్టు 8 రెండో శనివారం …దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు సెలవు. సిక్కిం లో కాంచనజంగా పర్వత పూజ సందర్భంగా అక్కడ బ్యాంకులకు హాలిడే. 


ఆగస్టు 10 సోమవారం ..తెలంగాణలో బోనాల సందర్భంగా బ్యాంకులకు సెలవు. 


ఆగస్టు 13 గురువారం.. దేశభక్తుల దినోత్సవం సందర్భంగా మణిపూర్ రాష్ట్రంలో ఉన్న బ్యాంకులన్నిటికీ ఆ రోజు సెలవు దినం. 


ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం. ఆరోజు దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు హాలిడే. 


ఆగస్టు 19 బుధవారం… రాజా వీర్ విక్రమ్ కిషోర్ మాణిక్య బహుదూర్ జయంతి సందర్భంగా త్రిపురలో సెలవు దినం. 


ఆగస్టు 25 మంగళవారం …మిలాద్ ఉన్ నబి. మొదటి ఓనం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ,కేరళ రాష్ట్రంలోని శాఖలు మూసివేస్తారు. 


ఆగస్టు 26 బుధవారం .. ఈద్ ఏ మిలాద్ ,తిరుమనం సందర్భంగా తెలంగాణ ,మహారాష్ట్ర, కర్ణాటక ,మధ్యప్రదేశ్ ,తమిళనాడు, ఉత్తరాఖండ్ మణిపూర్, జమ్మూ కాశ్మీర్ ,ఉత్తర ప్రదేశ్ ,కేరళ, ఢిల్లీ ,బీహార్ ,చత్తీస్గడ్ ,జార్ఖండ్ రాష్ట్రాల్లో శాఖలు పనిచేయవు. 


వారాంతపు సెలవులు 

ఆదివారాలైన ఆగస్టు 2 ,9 ,16 ,23 ,30 తేదీల్లో బ్యాంకులకు సెలవు. అలాగే రెండో శనివారం ఆగస్టు 8, నాలుగో శనివారం ఆగస్టు 22 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. 


ఏటీఎంల ద్వారా..

ఆగస్టు 2026 బ్యాంకు సెలవుల జాబితా


సెలవు రోజుల్లో ఏటీఎం ,యూపీఐ ,నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. డిజిటల్ విధానంలో అత్యవసరమైన పనులు పూర్తి చేసుకోవచ్చని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. 


 ఖాతాదారులు పై తేదీలను గుర్తు పెట్టుకొని తమ లావాదేవీలను ముందుగానే పూర్తి చేసుకొని ఎటువంటి ఇబ్బందులకు గురవకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కథనాన్ని అందిస్తున్నాం .అందరూ మీ కుటుంబ సభ్యులకు, మీ బంధువులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి. మీ విలువైన సూచనలు సలహాలు అందించండి. 

 

ఇలాంటి మరింత మెరుగైన సమాచారం కోసం మా 

తెలుగు న్యూస్ రూమ్ 

పేజీని ఫాలో అవ్వండి.


#ఆగస్టు బ్యాంకు సెలవులు

#August 2026 Bank Holidays

#Bank Holidays 2026

#RBI Bank Holidays

#బ్యాంకు హాలిడే లిస్ట్

#ఆగస్టు 2026 సెలవులు

Bank Holiday List Telugu

Bank News Telugu


ఆగస్టు బ్యాంకు సెలవులు, August 2026 Bank Holidays, Bank Holidays 2026, RBI Holidays, బ్యాంకు ఉద్యోగుల సెలవులు, బ్యాంకు హాలిడే లిస్ట్, బ్యాంక్ న్యూస్ తెలుగు, బ్యాంకు సెలవులు ఆగస్టు, బ్యాంకు బ్రాంచ్ హాలిడే, SBI Bank Holiday, Bank Holiday Today, Telugu Bank News, Public Holiday Bank, RBI Holiday Calendar, August Holiday List



Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్