తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు

Image
 FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది. విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.  1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.  తొలుత ఉన్న...

జూలై 2, 2026 పంచాంగం: తిథి, నక్షత్రం, రాహుకాలం, అమృతకాలం, సూర్యోదయం పూర్తి వివరాలు


జూలై 2, 2026 గురువారం తెలుగు పంచాంగం


తేదీ: జూలై 2, 2026

వారం: గురువారం (బృహస్పతివాసరే)


రోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, కృష్ణ పక్షంలోని విదియ తిథి. ఈ తిథి ఉదయం 7:54 గంటల వరకు కొనసాగుతుంది.


ఈ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 8:37 గంటల వరకు ఉంటుంది. అనంతరం తదుపరి నక్షత్రం ప్రారంభమవుతుంది. వైధృతి యోగం సాయంత్రం 4:25 గంటల వరకు ఉంటుంది.


కరణాల్లో గరజి ఉదయం 7:54 గంటల వరకు ఉండగా, ఆ తర్వాత వణిజ కరణం రాత్రి 8:29 గంటల వరకు కొనసాగుతుంది.


శుభాశుభ సమయాలు


- వర్జ్యం: మధ్యాహ్నం 12:55 నుంచి 2:38 వరకు

- దుర్ముహూర్తం: ఉదయం 9:53 నుంచి 10:45 వరకు, మధ్యాహ్నం 3:05 నుంచి 3:57 వరకు

- అమృతకాలం: రాత్రి 11:14 నుంచి 12:57 వరకు


ఈ రోజు రాహుకాలం & యమగండం


- రాహుకాలం: మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు

- యమగండం: ఉదయం 6:00 నుంచి 7:30 వరకు


గ్రహస్థితి


- సూర్యుడు: మిథున రాశిలో సంచరిస్తున్నారు.

- చంద్రుడు: మకర రాశిలో సంచరిస్తున్నారు.


సూర్యోదయం – సూర్యాస్తమయం


- సూర్యోదయం: ఉదయం 5:33 గంటలకు

- సూర్యాస్తమయం: సాయంత్రం 6:34 గంటలకు


గమనిక: ఈ రోజు ముఖ్యమైన శుభకార్యాలు లేదా పూజలు చేపట్టే ముందు స్థానిక పండితులను సంప్రదించి మీ ప్రాంతానికి అనుగుణమైన ముహూర్తాలను నిర్ధారించుకోవడం మంచిది.


ఇలాంటి మరింత సమాచారం కోసం మా 

తెలుగు న్యూస్ పేజీని 

ఫాలో అవ్వండి

Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

నాగబంధం సినిమా స్టోరీ (2026) | పూర్తి కథ, నటీనటులు, దర్శకుడు, నిర్మాతలు | Nagabandham Telugu Movie Story