తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

💰 జూన్ 7, 2026 బంగారం వెండి ధరలు – తాజా గోల్డ్ & సిల్వర్ రేట్లు

Image
  జూన్ 07, 2026 ఆదివారం బంగారం & వెండి ధరలు ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు తెలుసుకోవాలనుకునే వారికి తాజా వివరాలు ఇవే.   24 క్యారెట్ బంగారం ధర             1 గ్రాము – ₹15,273 10 గ్రాములు – ₹1,52,730 22 క్యారెట్ బంగారం ధర            1 గ్రాము – ₹14,000 10 గ్రాములు – ₹1,40,000 వెండి ధరలు            1 గ్రాము – ₹265 1 కిలో – ₹2,65,000   📈 బంగారం మరియు వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్, డాలర్ విలువ, డిమాండ్ వంటి అంశాల ప్రభావంతో ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. తాజా ధరల కోసం మా వెబ్‌సైట్‌ను ప్రతిరోజూ సందర్శించండి. గమనిక: బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితులను బట్టి మారవచ్చు. కొనుగోలు చేసే ముందు స్థానిక జ్యువెలరీ షాపులో ధరలను నిర్ధారించుకోండి. ఈ లాంటి మరిన్ని అప్డేట్లు కోసం మా వెబ్సైట్    TeluguNewsroom నీ follow చెయ్యండి. 🙏 ధన్యవాదాలు 🙏

భక్తుల దర్శనానికి భీమాశంకర్ జ్యోతిర్లింగ ఆలయం సిద్ధం

 



భారతదేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాలైన భీమాశంకర జ్యోతిర్లింగ క్షేత్రం భక్తుల దర్శనానికి సిద్ధమైంది. సుమారు 5 నెలల విరామం తర్వాత ఆలయంలో స్వామివారి దర్శనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు 

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం 

భీమాశంకర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించాలనుకునే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రారంభించింది .భక్తులు తమకు అనుకూలమైన తేదీల్లో రిజిస్ట్రేషన్లు చేసుకొని ఇబ్బందులు లేకుండా స్వామివారిని కనులారా వీక్షించవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ విధానం ద్వారా మహిళలు, వృద్ధులు, పిల్లలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. 


భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు …


మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర ఆలయ పరిస ప్రాంతాల్లో జరగనున్న సింహస్త కుంభమేళా ఏర్పాట్ల దృష్ట్యా రాష్ట్రంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ కారణంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలక్కుండా ఉండేందుకు భీమాశంకర ఆలయాన్ని ఈ ఏడాది జనవరి నుంచి తాత్కాలికంగా మూసివేశారు .ఈ సమయంలో ఆలయ ప్రాంగణంలో పలు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశారు. భక్తుల రాకపోకలు సులభంగా ఉండేలా రహదాలను విస్తరించారు. వృద్ధులు, వికలాంగుల దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ప్రకృతి సోయగాల నడుమ ..

మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రమైన భీమాశంకర జ్యోతిర్లింగ ఆలయం సహ్యాద్రి పర్వతశ్రేణుల మధ్య ప్రకృతి సోయగాల నడుమ అలరాలుతుంది .ఆధ్యాత్మికతతో పాటు మానసిక ఆహ్లాదం పొందేందుకు భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తుతారు.

జూన్ 15 నుంచి …

భీమాశంకర జ్యోతిర్లింగ దర్శనానికి జూన్ 15 నుంచి భక్తులను అనుమతిస్తున్నారు .ఈ నేపథ్యంలో జూన్ 5వ తేదీన రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. ఏటా లక్షలాదిమంది భక్తులు భీమాశంకర ఆలయాన్ని సందర్శిస్తారు. ముఖ్యంగా ఉత్సవాల సమయంలో ఈ సంఖ్య రెట్టింపు ఉంటుంది. 


బీమా శంకర్ జ్యోతిర్లింగ క్షేత్రం సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్ ..



1. పూణే రైల్వే జంక్షన్.. ఇక్కడి నుంచి ఆలయం 125 కిలోమీటర్ దూరంలో ఉంటుంది 

2. కర్జాత రైల్వేస్టేషన్…ఇక్కడి నుంచి ఆలయం సుమారు 106 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 

3. పూణే నుంచి మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులు, క్యాబులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. 


సమీప విమానాశ్రయం.. 

పూణే అంతర్జాతీయ విమానాశ్రయం .



కొండ ప్రాంతంలో ఈ ఆలయం ఉండటం వలన వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని భక్తులు తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలి.ఒక్కోసారి కొండ రాళ్లు విరిగి పడితే వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది .అప్పుడు రహదారులపై ట్రాఫిక్ జామ్ ఏర్పడి గంటలు తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడి వర్షపాతం వివరాలను భక్తులు ముందుగానే తెలుసుకుంటే మంచిది.


ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సైట్ 

www. bhimashankar.in

www.shreebhimashankar.com


పై వెబ్సైట్ ద్వారా భక్తులు తమ దర్శనం స్లాట్ ను బుక్ చేసుకోవచ్చు 


ఫోన్ నెంబర్..

91-02133 230501


వసతి సౌకర్యాలు..


భీమాశంకర్ ఆలయ పరిసర ప్రాంతాల్లో పలు ధర్మశాలలు, కాటేజీలు అందుబాటులో ఉంటాయి. ఇవే కాకుండా మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హోటల్స్ ఉన్నాయి.ఇవి ఆలయానికి సమీపంలోనే బడ్జెట్ ధరలో లభిస్తాయి..

భక్తులందరూ ముందుగానే వసతీ సౌకర్యాలు ,దర్శనస్లాటు, ట్రైన్ బస్ , ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని ప్రశాంతంగా ఆ స్వామివారిని దర్శించి తిరిగి తమ గమ్యస్థానాలకి క్షేమంగా లాభంగా చేరుకోవాలని కోరుకుంటున్నాము 


జై భీమాశంకర…జై జై బీమా శంకర


ఇలాంటి మరింత సమాచారం కోసం మా 

telugu newsroom పేజ్ ని ఫాలో చేయండి.





Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

వెంకన్న భక్తులకు అద్భుత అవకాశం