తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు

Image
 FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది. విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.  1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.  తొలుత ఉన్న...

జూన్ 7, 2026 ఆదివారం పంచాంగం: అమృతకాలం, రాహుకాలం, తిథి, నక్షత్రం పూర్తి వివరాలు

 🌞 జూన్ 7, 2026 ఆదివారం పంచాంగం – ఈరోజు అమృతకాలం రాత్రి సమయంలో! 🕉️


హిందూ సంప్రదాయంలో ప్రతి రోజు పంచాంగాన్ని పరిశీలించి పనులు ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు. ఈరోజు శతభిషం నక్షత్రం, వైధృతి యోగం ప్రభావంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దైవారాధన, ముఖ్య నిర్ణయాలకు అనుకూలమైన రోజు.


🕉️ ఈరోజు పంచాంగ వివరాలు


📅 తేదీ: జూన్ 7, 2026 – ఆదివారం


🌸 మాసం: అధిక జ్యేష్ఠ మాసం

🌑 పక్షం: కృష్ణ పక్షం


📖 తిథి: సప్తమి – రాత్రి 10:11 వరకు


⭐ నక్షత్రం: శతభిషం – మరుసటి రోజు తెల్లవారుజామున 4:42 వరకు


🔯 యోగం: వైధృతి – ఉదయం 6:50 వరకు


🔹 కరణం: భద్ర – ఉదయం 10:07 వరకు, అనంతరం బవ – రాత్రి 10:11 వరకు


♉ సూర్యరాశి: వృషభం


🏺 చంద్రరాశి: కుంభం


🌅 సూర్యోదయం: ఉదయం 5:28 గంటలకు


🌇 సూర్యాస్తమయం: సాయంత్రం 6:28 గంటలకు


⛔ రాహుకాలం


సాయంత్రం 4:30 నుంచి 6:00 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించకుండా ఉండటం మంచిది.


⚠️ యమగండం


మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 గంటల వరకు యమగండం ఉంటుంది. శుభకార్యాలకు ఈ సమయాన్ని నివారించడం శ్రేయస్కరం.


🚫 వర్జ్యం


ఉదయం 11:23 నుంచి మధ్యాహ్నం 1:02 గంటల వరకు వర్జ్యం ఉంటుంది.


❗ దుర్ముహూర్తం


సాయంత్రం 4:44 నుంచి 5:36 గంటల వరకు దుర్ముహూర్త సమయం ఉంటుంది.


✨ ఈరోజు అమృతకాలం


రాత్రి 9:17 నుంచి 10:56 గంటల వరకు అమృతకాలం కొనసాగుతుంది. ఈ సమయంలో దేవాలయ దర్శనం, జపం, ధ్యానం, ముఖ్య సంకల్పాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం శుభప్రదంగా భావిస్తారు.


🙏 ఈరోజు ఆధ్యాత్మిక సూచన


ఆదివారం కావడంతో సూర్యనారాయణ స్వామిని ఆరాధించడం విశేష ఫలితాలను ఇస్తుందని విశ్వాసం. ఉదయం సూర్యార్ఘ్యం సమర్పించడం, ఆదిత్య హృదయం పారాయణం చేయడం ద్వారా శక్తి, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని చెబుతారు.


🌺 ఈరోజు సందేశం


ఈరోజు అమృతకాలంలో భగవంతుని స్మరించి మీ ముఖ్యమైన పనులు ప్రారంభించండి. కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.

ఓం సూర్య దేవాయ నమః 

 ఓం ఆదిత్యాయనమః

ఈ మంత్రాలు సూర్యుడికి నీళ్ల లు వదిలి ఈ మంత్రాన్ని చదివి 11 సార్లు పట్టించి నమస్కారం చేసుకోండి

🕉️ లోకాః సమస్తాః సుఖినో భవంతు 🕉️


💬 మీరు ఈరోజు ఏ దేవాలయాన్ని దర్శించబోతున్నారు? కామెంట్ చేసి తెలియజేయండి.


🔔 WWW.TeluguNewsRoom.com 🗞️


Navagraha Shanti pariharam



Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

నాగబంధం సినిమా స్టోరీ (2026) | పూర్తి కథ, నటీనటులు, దర్శకుడు, నిర్మాతలు | Nagabandham Telugu Movie Story