తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు

Image
 FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది. విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.  1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.  తొలుత ఉన్న...

ఈరోజు పంచాంగం – జూన్ 29, 2026 (సోమవారం)

  


🌕 ఏరువాక పూర్ణిమ ప్రత్యేకం 🌕

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షం కొనసాగుతున్నాయి.

📅 పంచాంగ వివరాలు

తేదీ: 29 జూన్ 2026 (సోమవారం)

తిథి: పూర్ణిమ – మరుసటి రోజు తెల్లవారుజామున 4:25 వరకు

నక్షత్రం: మూల – మరుసటి రోజు తెల్లవారుజామున 3:54 వరకు

యోగం: శుక్లం – మధ్యాహ్నం 3:08 వరకు

కరణాలు:

భద్ర – మధ్యాహ్నం 3:26 వరకు

బవ – మరుసటి రోజు తెల్లవారుజామున 4:25 వరకు

⏰ శుభ – అశుభ సమయాలు

✅ అమృతకాలం

రాత్రి 8:48 నుంచి 10:35 వరకు

❌ వర్జ్యం

ఉదయం 10:09 నుంచి 11:56 వరకు

రాత్రి 2:08 నుంచి 3:54 వరకు

⚠️ దుర్ముహూర్తం

మధ్యాహ్నం 12:29 నుంచి 1:21 వరకు

మధ్యాహ్నం 3:05 నుంచి 3:57 వరకు

☀️ రాహుకాలం

ఉదయం 7:30 నుంచి 9:00 వరకు

🌑 యమగండం

ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు

🌞 గ్రహస్థితి

సూర్యరాశి: మిథునం

చంద్రరాశి: ధనుస్సు

🌅 సూర్యోదయం – సూర్యాస్తమయం

సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు

సూర్యాస్తమయం: సాయంత్రం 6:34 గంటలకు

🌕 ఈరోజు విశేషం

🌾 ఏరువాక పూర్ణిమ

వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టే పవిత్రమైన పండుగగా ఏరువాక పూర్ణిమను రైతులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజున భూమాతకు, ఎద్దులకు ప్రత్యేక పూజలు చేసి మంచి పంటలు పండాలని ప్రార్థిస్తారు.


ఫాలో తెలుగు న్యూస్ రూమ్ పేజీ.

Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

నాగబంధం సినిమా స్టోరీ (2026) | పూర్తి కథ, నటీనటులు, దర్శకుడు, నిర్మాతలు | Nagabandham Telugu Movie Story