తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు

Image
 FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది. విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.  1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.  తొలుత ఉన్న...

ఈరోజు బంగారం, వెండి ధరలు(25.6.26)

 



బంగారం 24 క్యారెట్ 

ఒక గ్రాము              రూ.14,291

10 గ్రాములు           రూ.1,64,861


బంగారం 22 క్యారెట్స్ 

ఒక గ్రాము            రూ.13,100

10 గ్రాములు.           రూ.1,51,122


వెండి ధర 

ఒక గ్రాము           రూ.239

కిలో ధర.             రూ.2,39,900


ఇరాన్, అమెరికా యుద్ధం ముగియటం.. డాలర్ తో రూపాయి మారకంలో మార్పులు, అంతర్జాతీయంగా నెలకొన్న స్థిర ప్రభావంతో బంగారం ,వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. మార్కెట్లో నెలకొన్న సంక్షోభానికి తెరపడటంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడును బంగారం నుంచి స్టాక్ మార్కెట్ వైపు మళ్ళించారు. ఈ నేపథ్యంలో ఈ లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ ధరల్లో హెచ్చుతగ్గులు కొన్ని రోజులు పాటు జరిగే అవకాశం ఉంది. ఎవరైనా బంగారు ,వెండి కొనుగోలు చేసేటప్పుడు తమ స్థానిక మార్కెట్ ధరలను ఒకసారి పరిశీలించి లావాదేవీలు నిర్వహించుకోండి. 


ఇలాంటి మరింత సమాచారం కోసం మా తెలుగు న్యూస్ రూమ్ 

పేజీని ఫాలో అవ్వండి.


Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్