తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు

Image
 FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది. విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.  1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.  తొలుత ఉన్న...

భాను సప్తమి ప్రాముఖ్యత (జూన్ 21,2026)



భాను సప్తమి ..ఆదివారం రోజున వచ్చే శుక్ల పక్ష సప్తమి తిథి. ఈ రోజు సూర్యభగవానుడికి అత్యంత ప్రీతికరమైన రోజు.  ఆరోజు సూర్యనారాయణుని భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు, దీర్ఘాయుష్షు లభిస్తాయి


 సూర్య భగవానుడి పూజతో కలిగే ఫలితాలు..

సూర్యదేవుని అనుగ్రహం లభిస్తుంది.

 దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుతాయి

ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి .

కుటుంబంలో సుఖశాంతులు, సంపద పెరుగుతుంది.


  ఆ రోజు చేయాల్సిన కార్యక్రమాలు..

 బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయాలి.

 ఉదయించే సూర్యునికి రాగి పాత్రలో నీరు, ఎర్ర పువ్వులు, అక్షతలు వేసి అర్ఘ్యం సమర్పించాలి.

 ఎర్రటి పూలతో సూర్యనారాయణుని పూజించాలి.

గోధుమలు, బెల్లం, ఎర్ర వస్త్రం సమర్పించడం శుభప్రదం.

వీలైతే ఆదిత్య హృదయం పారాయణం చేయాలి.

 12 సార్లు లేదా 108 సార్లు సూర్య నమస్కారాలు చేయవచ్చు.


 జపించాల్సిన మంత్రాలు

ఓం ఘృణిః సూర్యాయ నమః॥

ఓం హ్రాం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః॥

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్

తమోఽరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్॥

ఈ మంత్రాలను 11, 21 లేదా 108 సార్లు జపిస్తే ఎంతో శుభప్రదంగా భావిస్తారు.


 దానధర్మాలు

 గోధుమలు , బెల్లం , ఎర్రటి వస్త్రాలు,  రాగి పాత్ర, పండ్లు,  గోసేవ లేదా గోదానం , అన్నదానం, పేదలకు తాగునీరు, గొడుగు, చెప్పులు  దానం చేయాలి 


 దర్శించాల్సిన దేవాలయాలు

 సూర్యనారాయణ స్వామి ఆలయం,

 అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం,

 సూర్యనార్ కోవిల్, కోణార్క్ సూర్య దేవాలయం,

సమీపంలోని సూర్యనారాయణ, నవగ్రహ లేదా శివాలయంలో కూడా దర్శనం చేసుకోవచ్చు.


పాటించాల్సిన నియమాలు

 సూర్యోదయానికి ముందే లేవాలి.  సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి.  అబద్ధం, కోపం, హింసకు దూరంగా ఉండాలి.  తల్లిదండ్రులు, గురువుల ఆశీర్వాదం తీసుకోవాలి.  వీలైతే ఉపవాసం లేదా ఫలాహారం పాటించాలి.  సూర్యాస్తమయం వరకు భక్తితో సూర్యస్మరణ చేయాలి.


ఇలాంటి మరింత సమాచారం కోసం మా 

తెలుగు న్యూస్ రూమ్

 పేజీని ఫాలో అవ్వండి.


Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్