తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

తొలి ఏకాదశి 2026 ఎప్పుడు? విశిష్టత, పూజా విధానం, నైవేద్యాలు, ఉపవాస నియమాలు – పూర్తి వివరాలు

Image
  తొలి ఏకాదశి -2026 విశిష్టత పూజా విధానం  ఆరోజు చేయాల్సిన పనులు. శ్రీ మహా విష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి జారుకునే రోజే తొలి ఏకాదశి. నాలుగు నెలల తర్వాత వచ్చే ఉత్తాన ఏకాదశి రోజు ఆయన నిద్ర లేస్తాడు.  శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు కాబట్టే తొలి ఏకాదశి ఆ సంవత్సరంలో కెల్లా అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. 2026 వ సంవత్సరం జూలై 25 వ తేదీన తొలి ఏకాదశి వస్తుంది. శుభాల కలయిక ఆరోజు ఉపవాస ఉండి శ్రీమహావిష్ణువు పూజిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.  ఆర్థిక సమస్యలు తీరుతాయి . ఆ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది . చాతుర్మాస దీక్షల ప్రారంభానికి మంచి రోజు.  ఆరోజు చేయాల్సిన పనులు … ఆరోజు వేకువ జామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి. పూజ గదిని శుభ్రం చేసి దీపం వెలిగించాలో.శ్రీమహావిష్ణువుని ,శ్రీకృష్ణుడు , శ్రీరాముల వారిని పూజించాలి. ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండాలి. షుగర్ పేషెంట్లు ఉపవాసాలకు దూరంగా ఉంటే మంచిది.  ఆ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చదివితే జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుంది.  జపించాల్సిన మంత్రం  ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 స...

అమర్నాథ్ యాత్ర -2026 తొలి పూజ




 

కాశ్మీర్ కొండల్లో.. తెల్లని మంచు పర్వతాల నడుమ అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడే యాత్ర అమర్నాథ్ యాత్ర. హిమాలయ పర్వతాల్లో సముద్ర మట్టానికి సుమారు 3,888 మీటర్ల (12,756 అడుగులు) ఎత్తులో ఈ అమర్నాథ్ గుహ ఉంది. ఈ గుహలో సహజంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు యాత్ర చేస్తారు.


హిందూ పురాణాల ప్రకారం, పార్వతీ దేవికి అమరత్వ రహస్యాన్ని (అమర్ కథ) చెప్పడానికి ఆ పరమశివుడు ఈ గుహను ఎంచుకున్నారని విశ్వసిస్తారు. ఆ సమయంలో నంది, చంద్రుడు, నాగులు, గణాలు వంటి వారిని ఒక్కో చోట వదిలి చివరకు ఈ గుహకు చేరుకున్నారని కథనం చెబుతుంది.

మరో ప్రసిద్ధ కథనం ప్రకారం, గొర్రెల కాపరి Buta Malik ఈ గుహను తిరిగి ప్రజలకు పరిచయం చేశాడని స్థానిక విశ్వాసం ఉంది.


 ఈ సంవత్సరం యాత్ర ప్రారంభమయ్యే తేదీలు..

2026 సంవత్సరంలో అమర్‌నాథ్ యాత్ర జూలై 3, 2026న ప్రారంభమై ఆగస్టు 9, 2026 (శ్రావణ పౌర్ణమి / రక్షా బంధన్) వరకు కొనసాగుతుంది.



తొలి పూజ 

జూన్ 29 పౌర్ణమిని పురస్కరించుకొని అమర్నాథ్ గుహలోని మంచులింగానికి జమ్మూ కాశ్మీర్ గవర్నర్ రైనా చేతుల మీదుగా తొలి పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛనుల మధ్య ఆ మహాదేవుని చింతనతో కాశ్మీరు కొండలు మారుమోగాయి. పెద్ద సంఖ్యలో ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పోలీసులు సైన్యం హాజరయ్యారు. 


భారీ బందోబస్తు 

యాత్ర సందర్భంగా భక్తుల రక్షణను దృష్టిలో ఉంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశాయి. ఇండియన్ ఆర్మీకి చెందిన ఉత్తర కమాండ్ నేతృత్వంలో దారి పొడవున ప్రత్యేక బలగాలను మోహరించారు గన్స్ రాకెట్స్ బ్యాక్ స్క్వాడ్ పంప్స్ ప్యాడ్ యుఆర్పి డ్యూటీ సిఆర్పిఎఫ్ బలగాలు పాల్గొంటున్నాయి భక్తులు భద్రతా బలగాలిచ్చే సూచనలకు అనుగుణంగా తమ యాత్ర కొనసాగిస్తే క్షేమంగా దివ్యంగా స్వామివారిని దర్శించుకొని తిరిగి తమ గృహాలకు చేరుకోవచ్చు.


 కొనసాగే మార్గాలు 

1. Pahalgam మార్గం.

సుమారు 48 కి.మీ.

కొంచెం ఎక్కువ దూరం

ఎత్తుకు శరీరం అలవాటు పడేందుకు అనుకూలం

2. Baltal మార్గం

సుమారు 14 కి.మీ.

తక్కువ దూరం

నిటారుగా ఉండే కఠినమైన ట్రెక్కింగ్.


 భక్తులు పాటించాల్సిన నియమాలు..


నమోదు (రిజిస్ట్రేషన్) తప్పనిసరి.

అధికారిక యాత్ర అనుమతి పత్రం వెంట ఉంచుకోవాలి. గుర్తింపు కార్డు వెంట ఉండాలి.భద్రతా సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించాలి.

ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకూడదు.

పవిత్ర స్థల పరిశుభ్రతను కాపాడాలి.

నిర్ణయించిన మార్గంలోనే ప్రయాణించాలి.


 తీసుకోవాల్సిన జాగ్రత్తలు

యాత్రకు ముందు వైద్య పరీక్ష చేయించుకోవాలి.

గుండె, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవాలి.

వెచ్చని దుస్తులు, రెయిన్‌కోట్, గ్లౌజులు, ఉన్ని టోపీ వెంట తీసుకెళ్లాలి.

మంచి గ్రిప్ ఉన్న ట్రెక్కింగ్ షూలు ధరించాలి.

తగినంత నీరు తాగాలి.

అధిక ఎత్తు కారణంగా తలనొప్పి, శ్వాస ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఒంటరిగా ప్రయాణించకుండా గ్రూపులో వెళ్లడం మంచిది.


 వెంట తీసుకెళ్లాల్సిన వస్తువులు

ఆధార్ / గుర్తింపు కార్డు

యాత్ర అనుమతి పత్రం

వెచ్చని దుస్తులు

రెయిన్‌కోట్

ట్రెక్కింగ్ షూస్

టార్చ్

పవర్ బ్యాంక్

వ్యక్తిగత మందులు

నీటి బాటిల్

డ్రై ఫ్రూట్స్, ఎనర్జీ బార్స్


ఇలాంటి మరింత సమాచారం కోసం మా తెలుగు న్యూస్ రూమ్ 

పేజీని ఫాలో అవ్వండి.

Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్