తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

తొలి ఏకాదశి 2026 ఎప్పుడు? విశిష్టత, పూజా విధానం, నైవేద్యాలు, ఉపవాస నియమాలు – పూర్తి వివరాలు

Image
  తొలి ఏకాదశి -2026 విశిష్టత పూజా విధానం  ఆరోజు చేయాల్సిన పనులు. శ్రీ మహా విష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి జారుకునే రోజే తొలి ఏకాదశి. నాలుగు నెలల తర్వాత వచ్చే ఉత్తాన ఏకాదశి రోజు ఆయన నిద్ర లేస్తాడు.  శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు కాబట్టే తొలి ఏకాదశి ఆ సంవత్సరంలో కెల్లా అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. 2026 వ సంవత్సరం జూలై 25 వ తేదీన తొలి ఏకాదశి వస్తుంది. శుభాల కలయిక ఆరోజు ఉపవాస ఉండి శ్రీమహావిష్ణువు పూజిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.  ఆర్థిక సమస్యలు తీరుతాయి . ఆ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది . చాతుర్మాస దీక్షల ప్రారంభానికి మంచి రోజు.  ఆరోజు చేయాల్సిన పనులు … ఆరోజు వేకువ జామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి. పూజ గదిని శుభ్రం చేసి దీపం వెలిగించాలో.శ్రీమహావిష్ణువుని ,శ్రీకృష్ణుడు , శ్రీరాముల వారిని పూజించాలి. ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండాలి. షుగర్ పేషెంట్లు ఉపవాసాలకు దూరంగా ఉంటే మంచిది.  ఆ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చదివితే జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుంది.  జపించాల్సిన మంత్రం  ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 స...

💖 Mad For Each Other సోమవారం ఎపిసోడ్.. హౌస్‌లో లవ్ & ఎమోషన్స్!



💖 Mad For Each Other సోమవారం ఎపిసోడ్.. హౌస్‌లో లవ్ & ఎమోషన్స్!

మాడ్ ఫర్ ఈచ్ అదర్ సోమవారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మొదటగా లవ్ గురు అందరికీ సర్ప్రైజ్ పార్టీ ఉందని ప్రకటించడంతో హౌస్‌లో ఉన్న జంటలంతా గార్డెన్ ఏరియాలోకి వచ్చారు. అక్కడ అందరికీ బాక్స్‌లు ఇచ్చి ఓపెన్ చేయమన్నారు. బాక్స్‌లు ఓపెన్ చేయగానే అందులో గోల్డ్ హ్యాండ్ కపుల్స్ ఉండటంతో అందరూ సంతోషపడ్డారు. తర్వాత పార్టీ ఎంజాయ్ చేయండి అని చెప్పడంతో జంటలంతా డాన్స్ చేస్తూ సందడి చేశారు.


అదంతా పూర్తయ్యాక అందరూ తిరిగి తమ తమ రూమ్స్‌కి వెళ్లిపోయారు.


తర్వాత లవ్ గురు మరో టాస్క్ కోసం అందరినీ “లవ్ మెన్షన్” లోకి పిలిచాడు. అక్కడ ఒక ప్రత్యేకమైన ట్రీ ఏర్పాటు చేసి ఉంటుంది. ఒక వైపు గ్రీన్ ట్రీ, మరో వైపు ఎండిపోయిన ట్రీ ఉంటాయి. గ్రీన్ ట్రీ అంటే ఇచ్చిన ప్రామిసెస్ నిలబెట్టుకున్న జంటలు అని, ఎండిపోయిన ట్రీ అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ప్రామిసెస్ బ్రేక్ చేసిన జంటలు అని లవ్ గురు వివరించాడు.


ప్రతి జంట వచ్చి తమ అభిప్రాయం ప్రకారం ఎవరు ప్రామిసెస్ నిలబెట్టుకున్నారో వాళ్ల ఫోటోను గ్రీన్ ట్రీలో పెట్టాలి, ఎవరు బ్రేక్ చేశారో వాళ్ల ఫోటోను డ్రై ట్రీలో పెట్టాలి అని చెప్పారు.


ఈ టాస్క్‌లో కళ్యాణ్ – వాసంతి జంటకు ఎక్కువగా “ప్రామిసెస్ బ్రేక్ చేశారు” అనే ఓట్లు వచ్చాయి. తర్వాత స్థానంలో నటరాజ్ మాస్టర్ – నీతూ మాస్టర్ జంట నిలిచింది. ఇక ప్రామిసెస్ నిలబెట్టుకున్న జంటల్లో నూకరాజు – ఆసియా జంటకు ఎక్కువ మార్కులు వచ్చాయి.


ఈ సందర్భంగా కళ్యాణ్ – వాసంతి, నూకరాజు – ఆసియా, అలాగే నటరాజ్ మాస్టర్ – నీతూ మేడం మధ్య చిన్న చిన్న ఆర్గుమెంట్స్ కూడా జరిగాయి. అయితే అవి పెద్ద గొడవల వరకు వెళ్లలేదు.


అది ముగిసిన తర్వాత అందరూ మళ్లీ హౌస్‌లోకి వెళ్లిపోయారు.


తర్వాత లవ్ గురు మరోసారి ప్రకటిస్తూ “మెయిన్ పార్ట్నర్స్ హాల్లోకి రావాలి” అని చెప్పారు. దీంతో జెంట్స్ అందరూ హాల్లోకి వచ్చారు. లేడీస్ మాత్రం రూమ్స్‌లోనే ఉన్నారు.


ఇక్కడ జెంట్స్ కోసం ఒక ప్రత్యేక సర్ప్రైజ్ టాస్క్ పెట్టారు. తమ ప్రేమను ఎలా వ్యక్తపరుస్తారు? తమ పార్ట్నర్‌ను ఎలా సర్ప్రైజ్ చేస్తారు? అనే కాన్సెప్ట్‌తో ఐదు రకాల గిఫ్ట్ ఐటమ్స్‌ను అక్కడ ఉంచారు. వాటిలో ఒక్కో వ్యక్తి ఒక్కో వస్తువు మాత్రమే సెలెక్ట్ చేసుకొని తమ పార్ట్నర్‌కు ఎలా ప్రపోజ్ చేస్తారో చెప్పాలని సూచించారు.


ఈ టాస్క్‌లో నటరాజ్ మాస్టర్, కళ్యాణ్ ఇద్దరూ ఒకే వస్తువైన కాల్ పట్టీలు సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే మహేష్, భాను ఇద్దరూ బ్యాంగిల్స్ సెలెక్ట్ చేయడంతో కొద్దిసేపు డిస్కషన్ జరిగింది.


లవ్ గురు “ఒక్కొక్కరు ఒక్కో వస్తువు మాత్రమే తీసుకోవాలి” అని చెప్పడంతో చివరకు కళ్యాణ్ తన ఎంపిక మార్చుకుని కాల్ మెట్లు తీసుకున్నాడు. తర్వాత నటరాజ్ మాస్టర్, కళ్యాణ్, నూకరాజులకు వెళ్లి తమ పార్ట్నర్‌ను ఎలా సర్ప్రైజ్ చేయాలో ప్లాన్ చేసుకోమని చెప్పారు.


ఇక మహేష్, భాను మధ్య కూడా చిన్న డిస్కషన్ జరిగింది. మహేష్ “మాకు కొత్తగా పెళ్లైంది కాబట్టి బ్యాంగిల్స్ మా సర్ప్రైజ్‌కి బాగా సెట్ అవుతాయి” అని రిక్వెస్ట్ చేయడంతో భాను ఒప్పుకుని తాను పూలు సెలెక్ట్ చేసుకున్నాడు.


ఆ తర్వాత అందరూ తమ తమ ప్లాన్స్ ప్రిపేర్ చేసుకుంటూ రెడీ అయ్యారు.


ఇదంతా జరుగుతున్న సమయంలో శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. “సర్కిల్ ఆఫ్ లవ్” స్టేజ్ మొత్తాన్ని అందంగా మార్చేశారు. ఫ్లవర్స్‌తో డెకరేట్ చేసి పూర్తిగా రొమాంటిక్ వాతావరణం క్రియేట్ చేశారు. ఇక నుంచి గేమ్స్ కంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉండబోతుందని శ్రీముఖి తెలిపింది.


ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. ఇక తర్వాత ఎవరెవరు ఎలా ప్రపోజ్ చేస్తారు? ఎవరి సర్ప్రైజ్ బెస్ట్‌గా ఉంటుంది? ఫైనల్‌కు ఎవరు చేరుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారింది.


మీకు ఏ జంట అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ ఎపిసోడ్ గురించి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి.

Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్