తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు

Image
 FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది. విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.  1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.  తొలుత ఉన్న...

🚆 రైల్వేలో భారీ ఉద్యోగాలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్

 



రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ 
పోస్టులు భర్తీకి ప్రకటన


ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే లో భారతీయ రైల్వే ఒకటి.ప్రతిరోజు సుమారు 2.5 కోట్ల మంది ప్రయాణికుల్ని ,4.4 మిలియన్ టన్నుల సరకలను వేరువేరు గమ్యస్థానాలకు చేరవేస్తుంది.  ఈ ప్రక్రియలో లక్షల మంది సిబ్బంది సేవలు అందిస్తున్నారు. 



సంస్థను సమర్థంగా నిర్వహించేందుకు ఖాళీల భర్తీకి ఇండియన్ రైల్వే ప్రకటనను విడుదల చేసింది.


ప్రస్తుతం 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు భర్తీకి సన్నాహాలు చేస్తుంది. దీనిలో భాగంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. 



అర్హతలు: ఐటిఐ/అప్రెంటిస్షిప్/డిప్లమా/బీటెక్ తో దరఖాస్తు చేసుకోవచ్చు. 


వయసు.. జూలై 1 2026 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంది. 


పరీక్ష దశలు

సి బి టి 1 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్),

సి బి టి 2 (కంప్యూటర్ బేసిక్ టెస్ట్ సెకండ్ స్టేజ్),

సి బి ఏ టి (కంప్యూటర్ బేస్డ్ ఆటిట్యూడ్ టెస్ట్) ,

ధృవపత్రాల పరిశీలన ,

మెడికల్ టెస్ట్ .


పైవన్నీ అర్హత సాధిస్తే మీకు ఉద్యోగం గ్యారెంటీ.


సి బి టి 1, 2 తెలుగులో రాసుకోవచ్చు. దరఖాస్తు ఫారం లోనే మనం ఏ భాషలో రాస్తామో తెలపాలి. ఏదో ఒక ఆర్ఆర్బీ డివిజన్ పరిధిలోని ఖాళీలకే మనం పోటీ పడాలి. అందులో జోన్స్ వారిగా ప్రాధాన్యం ఎంచుకోవాలి. 



ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ..14.6.2026


ఫీజు.. మహిళలు ఎస్సీ, ఎస్టీ ,ఈ బీసీ ,ట్రాన్స్జెండర్స్ కు..250. సిబిటి వన్ పరీక్షకు హాజరైతే బ్యాంకు చార్జీలు పోను మిగతాది అకౌంట్ కు జమచేస్తారు. ఇతరులు 500 చెల్లించాలి. వీరు సిబిటి వన్ పరీక్షకుహాజరైతే బ్యాంకు చార్జీలతో పాటు అదనంగా వంద రూపాయలు మినహాయించి మిగిలిన మొత్తం ఎకౌంటుకు బదిలీ చేస్తారు. 


పరీక్ష తేదీ.. త్వరలో ప్రకటిస్తారు 

వెబ్సైట్ : https://www.rrbapply.gov.in/#/auth/landing.


వేతనం.. ఉద్యోగానికి ఎంపికైన వారికి 8వ వేతనం కమిషన్ ప్రకారం మొదటి నెల నుంచి 50 వేల జీతం అందుకుంటారు.


పూర్తి వివరాలు, సిలబస్ ,పరీక్ష నమూనా గురించి సంబంధిత వెబ్సైట్లో సమాచారం ఉంటుంది గమనించగలరు. 


మరింత మంచి కంటెంట్ కోసం తెలుగు న్యూస్ రూమ్ పేజీని 

ఫాలో చేయండి




Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

నాగబంధం సినిమా స్టోరీ (2026) | పూర్తి కథ, నటీనటులు, దర్శకుడు, నిర్మాతలు | Nagabandham Telugu Movie Story