తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు

Image
 FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది. విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.  1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.  తొలుత ఉన్న...

విద్యార్థులు నిరుద్యోగులు నిరుద్యోగులకు పోస్టల్ ఫ్రాంచైజీ అవకాశం

 



ఈ కామర్స్ రంగం, ఇతర కొరియర్ సంస్థ ల నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు పోస్టల్ శాఖ ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది. వాడ వాడలా, పల్లె పల్లెనా తన సేవలు విస్తరించేందుకు వినియోగదారులకు వేగంగా వస్తువులు చేరవేసేందుకు ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చింది. ఇది విద్యార్థులు, నిరుద్యోగులు, చిరు ఉద్యోగులకు, గృహిణులకు ఒక మంచి అవకాశం


అడ్వాన్స్ పోస్టల్ టెక్నాలజీ 2.0 


ఆధునిక పారదర్శక సేవలతో ఉపాధి అవకాశాన్ని పెంపొందించడమే దీని లక్ష్యం. స్పీడ్ పోస్ట్, డాక్యుమెంట్ బుకింగ్, పార్సిల్ బుకింగ్ ,ఇంటర్నేషనల్ బుకింగ్ పికప్ సేవలు, కాష్ ఆన్ డెలివరీ, ఇంటి నుంచి పార్సెల్ సేకరణ ..ఇలా రకరకాల సేవలు అందించవచ్చు. ఫ్రాన్సిసింగ్ గారు తమ అవకాశాన్ని బట్టి బుకింగ్ మాత్రమే, డెలివరీ మాత్రమే, పికప్ మాత్రమే, అన్ని సేవలు కలిపి ..అనే నాలుగు రకాల సేవలు ఎంచుకోవచ్చు .డెలివరీ సేవలు కోసం వాహనం ఉంటే సరిపోతుంది. బుకింగ్ సేవలకు చిన్న స్థలం స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్, ఇంటర్నెట్ ప్రింటర్ సదుపాయాలు ఉండాలి. 



అర్హతలు 

కనీస వయసు… 18 సంవత్సరాలు 

బుకింగ్ సేవలకు… ఇంటర్ ఉత్తీర్ణత 

డెలివరీ సేవలకు.. టెన్త్ పాస్ 

డెలివరీ సేవలకు డ్రైవింగ్ లైసెన్స్ వాహనం అవసరం 

పోస్టల్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఈ పథకానికి అనర్హులు.


డిపాజిట్ ఇలా 


డెలివరీ పికప్ సేవలకు ..5000 

బుకింగ్ సేవలకు - 10000 

అన్ని సేవలు కలిపి 15000 డిపాజిట్ చెల్లించాలి. 


మనకు వచ్చే వ్యాపారాన్ని బట్టి కమిషన్ చెల్లిస్తారు. 

లావాదేవీలు మొబైల్ యాప్ లేదా ఆన్లైన్ ద్వారా మొత్తం డిజిటల్ రూపంలో ఉంటాయి. ప్రతి లావాదేవీ కంప్యూటర్ అవుతుంది. 


నోటిఫికేషన్ 

 ఈ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం జనవరి ,ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలలో విడుదల చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు .ఎంపికైన వారికి శిక్షణ ఇస్తారు.



Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

నాగబంధం సినిమా స్టోరీ (2026) | పూర్తి కథ, నటీనటులు, దర్శకుడు, నిర్మాతలు | Nagabandham Telugu Movie Story