తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

FCRA బిల్లు 2026 అంటే ఏమిటి? పాత నిబంధనలు, కొత్త మార్పులు, NGOs ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పూర్తి వివరాలు

Image
 FCRA బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశ మైంది. ఎందుకంటే ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. వీటిలో కొన్ని నియమాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి రావటంతో ఎన్జీవోలకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా విదేశీ నిధులపై ఆధారపడి పని చేసే ఈ సంస్థలు ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి రావటం ,లావాదేవీల్లో పారదర్శకత ,విధుల్లో జవాబు దారితనం పెంపొందించాల్సి రావటంతో ఇన్నాళ్లు అడ్డదిడ్డంగా, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సంస్థలకు ఈ బిల్లు నోట్లో పచ్చి వెలక్కాయ పడిన చందాన మారింది. విదేశీ సంస్థల నుంచి భారతదేశంలో ని స్వచ్ఛంద సంస్థలు ,ట్రస్టులు స్వీకరించే విరాళాలు ఎలా సేకరించాలి. ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా లెక్కలు చూపాలి తదితర కార్యకలాపాలను పర్యవేక్షించేదే ఎఫ్ సి ఆర్ ఏ.  1976లో ఈ చట్టాన్ని రూపొందించారు. 2010 లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రకారం ఎఫ్ సి ఆర్ ఏ లైసెన్స్ తీసుకున్న సంస్థకు తొలుత ఐదు సంవత్సరాల కాల పరిమితికి లోబడి లైసెన్స్ ఇస్తారు .ఆ తర్వాత సంస్థ కార్యకలాపాలను పరిశీలించి ఆ లైసెన్సును రెన్యువల్ చేస్తారు.  తొలుత ఉన్న...

మెగాస్టార్ మరో బ్లాక్ బస్టర్ మూవీ

 



మన శంకర వరప్రసాద్ గారు మూవీతో సంక్రాంతికి సందడి చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ సినిమాకి శ్రీకారం చుడుతున్నారు. వాల్తేరు వీరయ్యతో చిరుకు మంచి విజయానందించిన బాబి ఈ కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. బాబీ- చిరు కాంబినేషన్ అంటే అభిమానులకు పెద్ద పండగే. వెంకట్ కే నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 21న పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్నట్లు మెగాస్టార్ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు.


చిరంజీవి సినిమా అంటే డాన్సులు, డైలాగులు ,మేనరిజం ఇవన్నీ ప్రత్యేకమే. మినిట్ మినిట్ కి అభిమానులకు వినోదాన్ని అందించగల సత్తా మెగాస్టార్కు ఉంది .అందుకే పెద్దలు,, పిల్లలు, యువతులు ,మహిళలు ఆయనను ఎంతగానో ఆరాధిస్తారు. 


రూపాయి పెట్టుబడి పెడితే నిర్మాతకు ₹100 లాభం కంపల్సరిగా వస్తుందని నమ్మకం. నిర్మాతలు ,డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ ఈ సినిమా పూర్తయి రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు .ఇది కూడా మరో విజయాన్ని దక్కించుకోవాలని మనస్పూర్తిగా కోరుతున్నాం. 


ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా తెలుగు న్యూస్ రూమ్ పేజీని ఫాలో అవ్వండి.

Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

నాగబంధం సినిమా స్టోరీ (2026) | పూర్తి కథ, నటీనటులు, దర్శకుడు, నిర్మాతలు | Nagabandham Telugu Movie Story